వికీ వ్యాఖ్యలో ఏమేం వ్రాయవచ్చును?

విజ్ఞప్తి:రచయితలకు సూచనల కోసం ఈ పేజీ వ్రాయబడుతున్నది. ఈ పేజీని కూడా అభివృద్ధి చేయడానికి సహకరించండి.

వికీ వ్యాఖ్యకు స్వాగతం.


వ్యాఖ్య (Quote) అన్నది ఏదైనా సందర్భంలో "ఉటంకించడానికి" అనుగుణమైన మాట లేదా వాక్యం లేదా పద్యం లేదా రచన. "ఫలానావారు అన్నట్లు" అని తరచు భాషలో వాడడం జరుగుతుంది. అటువంటివన్నీ వికీ వ్యాఖ్యకు అర్హమే. తెలుగు నుండి గాని ఇతర భాషలనుండి అనువదింపబడినవి గాని వికీ వ్యాఖ్యలో వ్రాయవచ్చును. కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇవ్వడమైనది.

రచనలు, రచయితలు
  • వేమన - పురుషులందు పుణ్య పురుషులు వేరయా
  • శ్రీశ్రీ - (1) కాదేదీ కవితకనర్హం. (2) ఏ దేశపు చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.
  • గురజాడ - డామిట్ కధ అడ్డం తిరిగింది
  • బెర్ట్రాండ్ రస్సెల్ - ముందుగా, పని అంటే ఏమిటి? రెండు రకాల పనులున్నాయి. మొదటిది - ఒక వస్తువును భూమిమీద ఇక్కడనుండి తీసి అక్కడ పెట్టడం; రెండవది - అది చేయమని ఇంకొకరికి పురమాయించడం. మొదటి పని చేయడం కష్టం, దానికి వచ్చే ప్రతిఫలం కూడా చాలా తక్కువ. రెండవ పని చేయడం చాలా ఆహ్లాదకరం. అందుకు జీతం కూడా అత్యధికం.
  • శ్రీకృష్ణ దేవరాయలు - దేశ భాషలందు తెలుగు లెస్స
  • కార్ల్ మార్క్స్ - (1) గత కాలపు చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే. పీడించే వారు, పీడితుల మధ్య (2) ప్రపంచ కార్మికులారా ఏకం కండి. సంకెళ్ళు తప్పితే పోవడానికి మీకింకేమీ లేవు. కాని ప్రపంచాన్ని మీరు జయించవచ్చును.


సినిమాలు - పాటలు, మాటలు, తెరవెనుక కధలు
  • వెళ్ళవయ్యా వెళ్ళూ
వార్తా వ్యాఖ్యలు
  • పెద్దలా?, గెద్దలా?
పద్యాలు - చాటు పద్యాలు, సమస్యా పూరణాలు, వర్ణనలు
సామెతలు, జాతీయాలు


పెద్దల ఉపదేశాలు, చతురోక్తులు
వేదాంత సూక్తులు