వేటూరి సుందర రామమూర్తి

సుప్రసిద్ధ సినీ గేయ రచయిత

వేటూరిగా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. 1939 జనవరి 29న కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి గ్రామంలో జన్మించాడు. 8 నంది పురష్కారాలతో పాటు అనేక అవార్డులు పొందినాడు. 2010, మే 22న మరణించాడు.

సప్తపది సినిమాలో

పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు
అల్లన మోవికి తాకితే గేయాలు

అర్జున్ సినిమాలో

మనసు ఉంటే మార్సుదాకా మార్గముంటుంది

ఇతరములు

మంచు తాకి కోయిల మౌనమైన వేలల
ఆమని పాడవే హాయిగా, ...
రాలేటి పూల రాగాల తో, పూసేటి పూల గంధలతో ...


ఎడారిలొ కోయిల,
తెల్లరనీ రేయిలా ...
పూదారులన్ని గోదారికాగ,
పాడింది కన్నీటి పాట.


త్రి కాలములు నీ నేత్ర త్రయమై
చతుర్ వేదములు ప్రాకారములై
పంచ భూతములు ముఖ పంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వర సప్తకమై
నీ ధృక్కులే అటు అష్ట దిక్కులై
నీ వాక్కులే నవ రసమ్ములై
నీ మౌనమే దశో పనిసత్తులై ఇల వెలయ - లయ నిలయుని విరాట్రూపం


మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలు

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.