వేములపల్లి శ్రీకృష్ణ

వేములపల్లి శ్రీకృష్ణ (1917-2000) ప్రముఖ కమ్యూనిష్టు నేత, శాసనసభ్యులు మరియు కవి. వీరు "చేయెత్తి జైకొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు. వీరు గుంటూరు జిల్లా,రేపల్లె తాలూకా బేతపూడి గ్రామంలో జన్మించారు. వీరు రేపల్లె లో ఉన్నత విద్యనభ్యసించి, గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. వీరు ప్రముఖ కమ్యూనిష్టు నాయకులు పులుపుల వెంకట శివయ్య గారి ప్రోత్సాహంతో 1938లో కమ్యూనిష్టు పార్టీ సభ్యత్వం స్వీకరించారు. వీరు 1948లో గుంటూరు జిల్లా కమ్యూనిష్టు కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. వీరు 1940 దశకంలో సాంస్కృతిక ఉద్యమంలో చురుకుగా పాల్గొని గేయ రచనలోను, వివిధ జానపద కళారూపాలను వెలుగులోకి తేవడానికి సహాయపడ్డారు. 1950 దశకంలో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ కాలంలో "చేయెత్తి జై కొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో నిలిచిపోయారు.

గేయ పాదాలు మార్చు

  • "చేయెత్తి జై కొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి గలవోడా!!"[1].

బయటి లంకెలు మార్చు

చేయెత్తి జైకొట్టు తెలుగోడా

మూలాలు మార్చు

 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994, పుట-6