• తోలుతిత్తి ఇది, తూటులు తొమ్మిది, తుస్సుమనుట ఖాయం, జీవా తెలుసుకో అపాయం.
  • జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసారసాగరం నాది, సన్యాసం శూన్యం నాదీ
- సిరివెన్నెల (( చక్రం చిత్రం నుండి )
  • ముందు తెలిసిన పిదప వెనుక మరచెదనన్న, ముందేల యెరుగు? తా వెనుకేల మరచు? దాహమడగిన పిదప తత్వమెరిగెదనన్న, దాహమేలడగు? తా తత్వమేమి ఎరుగు?
- అన్నమయ్య
  • నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము
- అన్నమయ్య
  • జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయా, ఈ వింతేనయా - లాహిరి నడి సంద్రమునా లంగరుతో పనియేలా?
- దేవదాసు చిత్రం నుండి
  • మాయంటావా? మిధ్యంటావా? నా ముద్దుల వేదాంతీ! ఏమంటావు?
- శ్రీశ్రీ
  • నిజమైనా కలయైనా, నిరాశలో ఒకటేలే; రేయైనా పగలైనా ఎడారిలో ఒకటేలే (సినిమాపాట)
"https://te.wikiquote.org/w/index.php?title=వైరాగ్యం&oldid=13377" నుండి వెలికితీశారు