శ్రీశ్రీ
అభ్యుదయ కవి
శ్రీశ్రీ (జనవరి 2, 1910 — జూన్ 15, 1983), ప్రముఖ అభ్యుదయ తెలుగు కవి, సినిమా గీతరచయిత. ఇతని పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాస రావు.
శ్రీశ్రీ యొక్క ముఖ్య వ్యాఖ్యలు
మార్చుచరిత్ర గురించి
మార్చు- ఆ రాణి ప్రేమ పురాణం, ఆ ముట్టడి కైన ఖర్చులు, మతలబులు, కైఫీయతులు, ఇవి కాదోయ్ చరిత్ర సారం.
- ఏ దేశపు చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం
- ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీ లెవ్వరు?
- తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
కవిత్వం గురించి
మార్చు- కాదేదీ కవితకనర్హం
- ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్న మాటే.
- కవిత్వమొక తీరని దాహం
- హీనంగా చూడకు దేన్నీ, కవితామయమోయ్ అన్నీ.
వ్యక్తులపై
మార్చు- కొంతమంది యువకులు పుట్టుకతో వృధ్ధులు
- వ్యక్తికి బహువచనం శక్తి
- బానిసకొక, బానిసకొక, బానిసకొక బానిస (జలగం వెంగళరావుపై శ్రీశ్రీ విమర్శ)
- వేయిపడగలు, లక్ష పిడకలు, కాగితప్పడవలు, చాదస్తపు గొడవలు. (విశ్వనాథ సత్యనారాయణ యొక్క వేయిపడగలు రచనపై చేసిన వ్యాఖ్య)
- పడిపోయిన ప్రకాసురుడి పాత ప్రభుత గుడ్డిది, నిజానికది కాంగిరెద్దు నీలం సంజీవరెడ్డిది[1](టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వంపై వ్యాఖ్య)
ఇతరాలు
మార్చు- కటుకథకూ, పెట్టుబడికీ పుట్టిన విషపుత్రికలు (మీడియాపై చేసిన వ్యాఖ్య)
- పదండి ముందుకు, పదండి ముందుకు తోసుకుపోదాం పైపైకి.
- ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం
- శోధించి సాధించాలి అదియే ధీరగుణం.
- హింస తోనే సృష్టి పూస్తది; హింస తోనే మార్పు వస్తది
- మంటలచేత మాట్లాడించి, రక్తం చేత రాహాలాపన చేయిస్తాను.
- ఈ జన్మను సద్వినియోగం చేసుకోవడం చేతకాక లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం.
- న్యాయం గెలుస్తుందన్నమాట నిజమేకాని గెలిచేదంతా న్యాయం కాదు.
- ముందు దగా, వెనుక దగా, కుడిఎడమల దగాదగా.
సినిమా పాటలు
మార్చు- ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా - భూమి కోసం
- కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు - వెలుగునీడలు
- తెలుగువీర లేవరా...దీక్షబూని సాగరా...దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా - అల్లూరి సీతారామరాజు
- మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే బాగ్యము అదే స్వర్గము - డాక్టర్ చక్రవర్తి
మూలాలు
మార్చు- ↑ అనంతం:శ్రీశ్రీ, శ్రీశ్రీ ప్రచురణలు, చెన్నై,మే-2000, పుట-192