సంస్థాగత సంస్కృతి

సంస్థాగత సంస్కృతి (ఆంగ్లం: Organizational Culture) సంస్థలలో సాంస్కృతిక విలువల పద్ధతుల మూలాలని, అభివృద్ధిని వివరించే సంస్థాగత సిద్ధాంతం లోని ఒకానొక అంశం. సంస్థలు, పరిపాలకులు ఈ ప్రక్రియనే Corporate Culture లేదా Administrative Culture (పరిపాలనా సంస్కృతి) అని కూడా వ్యవహరిస్తారు.

  • "బాహ్య స్వీకరణకీ, అంతర్గత అనుసంధానానికి మధ్య ఉద్భవించే సమస్యలని పరిష్కరించుకొనటానికి ఒక సమూహం నేర్చుకొన్న, నిరూపించబడిన, ఆమోదించబడిన, అందువల్లే కొత్త సభ్యులకి హేతుబద్ధ కోణంలో మరియు భావోద్రేక కోణంలో సమస్యలని పరిష్కరించుకోవటానికి సరియైన విధానంగా అందివ్వబడే సాధారణ ప్రాథమిక ఊహల నమూనా." - ఎద్గార్ హెచ్ షైన్
  • "సంస్కృతి అనే పదం నృశాస్త్రం నుండి వచ్చినది. దీని అర్థం పై ఏకాభిప్రాయం లేదు. అందుకే సంస్థాగత అధ్యయనాలలో దీని అనువర్తనాలు విధవిధాలుగా ఉండటంలో ఆశ్చర్యం లేదు." - QSmircich, 1983
  • "సంస్థాగత సంస్కృతి సంస్థలో సర్వత్రా ఉనికిలో ఉన్న వివిధ సందర్భాలలో మనం ఏం చేస్తాం, ఏం ఆలోచిస్తామో వాటిలో ఇమిడి ఉన్న సాంప్రదాయాల, విలువల, విధానాల, నమ్మకాల మరియు ధోరణుల సముదాయం." - McLean and Marshall, 1985
  • "పని చేయటానికి మనం ఏమేం చేయాలో అవి చేయటం." - Bright and Parkin, 1997