సత్యసాయిబాబా
సత్యసాయిబాబా నవంబరు 23, 1926న అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జన్మించాడు. ప్రముఖ అధ్యాత్మికవేత్తగా వెలుగొంది ఏప్రిల్ 23, 2011న మరణించాడు.
సత్యసాయిబాబా యొక్క ముఖ్య ప్రవచనాలు, వాక్యాలు, కొటేషన్లు
మార్చు- అధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవాలంటే అధ్యాత్మిక మార్గంలోనే సాధ్యమౌతుంది.
- ఆహారంలో క్రమశిక్షణ లేకపోవడమే అనారోగ్యానికి మూలం
- తెలుగువారికి తమిళ సినిమా ఎంత అర్థమౌతుందో నాస్తికుడికి అధ్యాత్మికత అంతే అర్థమౌతుంది.
- ధనం వస్తుంది, పోతుంది, జ్ఞానం వస్తుంది పెరుగుతుంది.
- రాయిలోనూ, బొమ్మలోనూ భగవంతుడిని చూడు, కాని భగవంతుడిని రాయిలాగా, బొమ్మలాగా చూడకు.
- ఈ రోజును ప్రేమతో మొదలుపెట్టు,ఇతరుల కోసం ప్రేమతో సమయం వెచ్చించు,రోజంతా నీలో ప్రేమను నింపుకో,ప్రేమతోనే ఈ రోజును ముగించు,దేవుని గుర్తించడానికి అదే సరైన దారి.
- కోరికలు ప్రయాణంలో తీసుకువెళ్లే వస్తువ్వులాంటివి..ఎక్కువైతే జీవిత పయనం కష్టమౌతుంది.
- క్రమశిక్షణ సరిగా ఉంటే ఇంకొకరి రక్షణ అవసరం లేదు.
- అన్నం పెట్టేవాళ్లు,అమృతం పెట్టేవాళ్లేకాదు విషం పెట్టేవాళ్లు కూడా నావాళ్లే.
- మనిషి తనలోని ఈర్ష్య,అసూయ,ద్వేషాలను,కోరికలను,ప్రాపంచిక సుఖ భోగాలను త్యజిస్తూ పోతే అదే నిజమైన భగవత్ పూజ