సన్-జు
సన్-జు 孫子; Sūn Zǐ చైనాకు చెందిన సైన్యాధ్యక్షుడు, యుద్ధవ్యూహకర్త, ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యూహాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన గ్రంథం యుద్ధకళ గ్రంథకర్త.
యుద్ధ కళ
మార్చుయుద్ధకళ గ్రంథం నుంచి అనువదించిన కొన్ని వ్యాఖ్యలు
- యుద్దతంత్రం అంతా మభ్యపుచ్చడంపైనే ఆధారపడివుంది. మనం దాడిచేసే సామర్థ్యంతో ఉన్నప్పుడు చేయలేనట్టుగా కనిపించాలి; మన బలగాలను వినియోగిస్తున్నప్పుడు, నిస్తేజంగా కనిపించాలి; మనం దగ్గరగా ఉన్నప్పుడు, మన శత్రువు మనం దూరంగా ఉన్నామని నమ్మేలా చేయాలి; మనం దూరంగా ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నామని నమ్మించాలి.
- ఎవరైతే యుద్ధవ్యూహాల్లో అత్యున్నత స్థాయిని అందుకుంటారో, వారు ఇతరులను తప్పనిసరి స్థితిలో పెడతారు తప్ప వారినెవరూ తప్పనిసరి స్థితిలోకి నెట్టలేరు.
- ఎప్పుడైతే నువ్వు వేగంగా పోరాడితే జీవించి లేకుంటే మరణిస్తావో దాన్ని మృత్యురంగం అంటారు. వారిని(నీ సైనికులను) పారిపోవడానికి దారిలేని, ఆ ప్రయత్నం చేస్తే ముందుగానే మరణించే ప్రదేశంలో నిలబెట్టు. అక్కడ మరణించబోతారని తెలిస్తే, వారు చేయలేనిదేముంటుంది? యోధులు వారి పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. యోధులు గొప్ప ప్రమాదంలో వున్నప్పుడు వారికి భయం ఉండదు. వారు ఎక్కడికీ పోయేందుకు దారి లేదంటే వారు దృఢంగా తయారవుతారు. వారు రంగంలోకి పూర్తిగా దిగినప్పుడు, పోరాటానికి నిబద్ధులై ఉంటారు. వారికి మరే అవకాశమూ లేకపోతే వారు పోరాడతారు.
- సైన్యం అవసరానికి తగ్గట్టు విడిపోతూ, తిరిగి కలుసుకోగలిగిన విభాగాల మార్పులతో అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. అప్పుడు దాని వేగం వాయువేగానికి సమానం, దాని నెమ్మదితనం అడవితో సమానం, దాని దండయాత్ర అగ్నితో సమానం అవుతుంది. దాన్ని గురించి తెలుసుకోవడం చీకటిని తరచిచూడడమంత కష్టం. ఆ సైన్యం దాడికి వెళ్ళడం పిడుగు పడిన చందం.
- నాయక వర్గానికి ఏ ఆశయమైతే ఉందో అదే ఆశయం ప్రజలకు కూడా కల్పించగలిగితే, వారితో మరణాన్నీ, జీవితాన్నీ కూడా చావుకు భయపడకుండా పంచుకుంటారు.
- ఎప్పుడైతే ఆయుధాలు నిస్త్రాణమవుతుందో, స్ఫూర్తి అణగారిపోతుందో, ఎప్పుడైతే మన బలం లోతులు తాకి, వనరులు ఖాళీ అయిపోతాయో, అప్పుడు ఇతరులు మన నిస్సత్తువను అవకాశంగా తీసుకుంటారు. అప్పుడు ఒకవేళ నీ దగ్గర వివేకవంతులైన సైన్యాధ్యక్షులు ఉన్నా చివరికి పరిస్థితిని నీకు అనుకూలంగా తిప్పలేవు.