సర్వదర్శన సంగ్రహం

సర్వదర్శన సంగ్రహం మాధవాచార్య విద్యారణ్యునిచే రచించబడిన నాస్తికవాద గ్రంథం. చార్వాకం, బృహస్పతి సూత్రాల నుండి ఇది గ్రహించబడినది. మాధవ విద్యారణ్యుడు విజయనగర సామ్రాజ్యంలో హరిహరునికి, బుక్క రాయకీ రాచగురువు, మహర్షి. శృంగేరీ శారదా పీఠానికి 12వ జగద్గురువుగా 1380-1386 వరకూ వ్యవహరించారు. హంపి లో గానీ, వరంగల్లులో గానీ వీరు జన్మించి ఉండవచ్చునని ఒక అభిప్రాయము కలదు.

సర్వదర్శన సంగ్రహం

చార్వాక దర్శనం

మార్చు
  • యావజ్జీవత్ సుఖం జీవేత్, జీవోన్నాస్తి మృత్యురాగోచర:

భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుత:

(జీవించినంతకాలం సుఖంగా జీవించు, ఏ జీవి మృత్యువాత పడకుండా తప్పించుకోలేడు
ఒక్క మారు ఈ శరీరము భస్మమైపోయిన తర్వాత, తిరిగి రావటం ఎవరు చూశారు?)

  • 5వ శ్లోకం
  • త్యాజ్యం సుఖం విషయసంగమజన్మం పుంసాం దు:ఖోపసృష్టమితి మూర్ఖావిచారణౌషా

బ్రీహింగ్జిహా సతి సితోత్తమతండులాఢ్యాన్ కో భోస్తుపకణోపహితాన్ హితార్థీ

(ఐహిక భోగాలలో/భౌతికవాద సుఖములలో దు:ఖము పొంచి ఉన్నది అందుకే వీటిని పరిత్యజించాలి అనుకొనటం మూర్ఖత్వం.
బుద్ధిమంతుడెవ్వడూ ధాన్యములో పొట్టు/మురికి ఉన్నదని, తెల్లని పౌష్టికరమైన వరిని సేవించటం మానుకొనడు.)

  • 10వ శ్లోకం
  • అగ్నిహోత్రం త్రయో వేదాస్త్రిదండం భస్మగుంఠనం

బుద్ధిపౌరుషహీనానాం జీవికేతి బృహస్పతి:

(వేదాలు, యజ్ఞోపవీతాలు మరియు భస్మలేపనాలు
ఇవన్నియు బుద్ధిహీనుల, పురుషులు కాని వారి బ్రతుకుదెరువు కొరకే)

  • 11వ శ్లోకం
  • అత్ర చత్వారి భూతాని భూమ్యాపనలానిలా:. చతుర్భ్య: ఖలు భూతేభ్యశ్చైతన్యముపజాయతే

కిణ్వాదిభ్య: సమేతేభ్యో ద్రవ్యేభ్యో మదశక్తివత్. అహం స్థూల: కృషోస్మీతి సామాన్యాధికరణ్యత:
దేహ: స్థౌల్యాది యోగాచ్చ స ఏవాత్మా న చాపర:. మమ దేహోయమిత్యుక్తి: సంభవేదౌపచారికీ

(ఈ సృష్టిలో భూమి, జలము, వాయువు మరియు అగ్ని; ఈ నాలుగు భూతాలు మాత్రమే కలవు. వీటివల్లనే చైతన్యం ఉత్పన్నమవునే కానీ భగవంతుడి వల్ల కాదు.
మాదక కణాలు కలిసినపుడు ఎట్లు మాదకశక్తి ఉత్పన్నమౌనో ఈ నాలుగు భూతాలు కలిసినపుడు అట్లు చైతన్యం ఉత్పన్నమవుతుంది.
లావుగా ఉండటం, సన్నగా ఉండటం వంటివన్నీ ఒకే శరీరానికి సంబంధించినవి. ఊబకాయం, కృశకాయం ఇవన్నియు ఒకే శరీరంలో ఉంటాయి. కావున ఆ శరీరమే ఆత్మ, వేరేదీ కాదు. 'నా శరీరం' వంటి పదాలు కేవలం అలంకారప్రాయాలే.)

  • 13, 14, 15వ శ్లోకాలు
  • అగ్నిరుష్ణో జలం శీతం శీతస్పర్శస్తథానిల:

కేనేదం చిత్రితం తస్మాత్ స్వభావాత్తధ్వవస్థితిరితి

(అగ్ని వేడిగా ఉంటుంది. నీరు చల్లగా ఉంటుంది. ప్రొద్దుటే వీచే పిల్లగాలి తాజాగా ఉంటుంది.
ఈ వైవిధ్యం ఎవరిచే ప్రాప్తించినది? వాటి స్వభావరిత్యా మాత్రమే సిద్ధించినది)

  • 19వ శ్లోకం
  • న స్వర్గో నాపవర్గో వా నైవాత్మా పారలౌకిక:

నైవ వర్ణాశ్రమాదీనాం క్రియాశ్చ ఫలదాయికా:

(స్వర్గం, నరకం, మోక్షం, ఆత్మ మరియు పరలోకఫలాలు; ఇవేవీ లేవు.
వర్ణాశ్రమ భేధాలతో చేసే క్రియల వలన తర్వాతి కాలంలో వాటి వల్ల ఫలితాలు కలుగుతాయన్నది కూడా ఒట్టి మాటే!)

  • 20వ శ్లోకం
  • పశుశ్వేన్నిహత: స్వర్గ జ్యోతిష్టోమే గమిప్యతి

స్వపితా యజమానేన తత్ర కస్మాన్న హింస్యతే

(జ్యోతిష్టోమాది యజ్ఞంలో ఏ పశువునైతే వధిస్తారో అది స్వర్గానికేగుతుందని తెలిపెదరు.
ఇదే సత్యమైతే ఏదో ఒక యజ్ఞం చేసి మీ తల్లిదండ్రులను కూడా కాళికి బలివ్వచ్చు కదా? అలా చేస్తే వారికి కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది కదా?)

  • 22వ శ్లోకం
  • మృతానామపు జంతూనాం శ్రాద్ధం చేత్తృప్తికారణం

నిర్వాణస్య ప్రదిపస్య స్నేహ: సంవర్ధయేచ్ఛిఖాం

(చనిపోయిన వ్యక్తి పేరుపై శ్రాద్ధం నిర్వహించటం వలనే అతని ఆత్మ శాంతించేటట్లయితే మనం దూరప్రదేశాల ప్రయాణానికి వెళ్ళినపుడు కూడా భోజనం ఎందుకు తీసుకువెళ్ళటం?
వంటలన్నీ ఇంట్లోనే వండేసి నివేదించేస్తే ఆ భోజనం దానంతకై అదే మనకు ఆకలి వేసినపుడు మన ఆకలిని తీరుస్తుంది.)

  • 23వ శ్లోకం
  • స్వర్గస్థితా యదా తృప్తిం గచ్ఛ్యేస్తత్ర దానత:

ప్రాసాదస్యోపరిస్థాన మాత్ర కస్మాన్న దీయతే.

(స్వర్గంలో ఉన్న వారి ఆత్మలకు శాంతి, భూమిపై వారి శ్రాద్ధాలతోనే జరిగేటట్లైతే
ఇంటి పై కప్పుపై ఉన్న వారి ఆకలిని క్రింది అంతస్థు నుండే తీర్చవచ్చు కదా?)

  • 24వ శ్లోకం
  • యావజ్జీవేత్ సుఖం జీవేత్ ఋణం కృత్వా ఘృతం పిబేత్

భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుత:.

(జీవించినంత కాలం సుఖంగా జీవించు అప్పు తీసుకునైనా నేతిని సేవించు
ఒక్కమారు ఈ దేహం కాలి బూడిదైన తర్వాత అది తిరిగివచ్చునా?)

  • 25వ శ్లోకం
  • యది గచ్ఛేత్పరం లోకం దేహాదేష వినిర్గత:

కస్మాద్భూయో న చాయాతి బంధుస్నేహసమాకుల:

(ఈ దేహాన్ని విడిచి పరలోకము వెళ్ళగలిగినవారు
వారు ప్రేమించే బంధువుల, స్నేహితుల దేహాలలోకి ఎందుకు తిరిగిరారు?)

  • 26వ శ్లోకం
  • త్రయో వేదస్య కర్తారో భండధూర్తనిశాచారా:

జర్ఫరీతుర్ఫరీత్యాది పండితానాం వచ:

(వేదాల కర్తలు ముగ్గురు. వారే విదూషకులు, దొంగలు మరియు రాక్షసులు.
పండితులుగా చెప్పుకొనే వీరు, వీరి నానా రకాల జర్ఫరి, తుర్ఫరి వంటి వాక్యాలతోనే వేదాలను నింపేశారు.)

  • 27వ శ్లోకం
  • అశ్వస్యాత్ర హి శిశ్నం తు పత్నీగ్రాహ్యం ప్రకీర్తితం.

భండైస్తద్వత్పరం చైవ గ్రాహ్యజాతం ప్రకీర్తితం.
మాంసానాం ఖాదనం తద్వన్నిశాచరసమీరితిమితి.
తస్మాద్ బహూనాం ప్రాణీనామనుగ్రహార్థ చార్వాకమతమాశ్రయణీయమితి రమణీయం.

(అశ్వమేథ యాగం చేసేవాడు ధర్మపత్నిని త్యజించి తలను నరికివేయాలి.
ఇవన్నీ విదూషకులు రచించారు. స్వర్గ నరకాది విషయాలు ధూర్తులు రచించారు.
ఏయే శాస్త్రాల్లోనైతే మద్యమాంసాలు నైవేద్యంగా సమర్పించాలని రాయబడ్డాయో, వాటిని రాక్షసులు రచించారు.
తమను తాము పండితులుగా చెప్పుకొనే వీరందరూ ఈ రచనలను తమ పొట్ట నింపుకోవటానికి చేశారు.
చార్వాకుడు ఇటువంటి వారిని, వీరి రచనలనే ఖండించాడు. సర్వప్రాణులకు జ్ఞానుగ్రహాన్ని ప్ర్రాప్తింపజేసేందుకు కృషి చేసి ఈ మతాన్ని విస్తరింపజేశాడు. ఈ చార్వాక మతాన్నే అందరూ అనుసరించాలి. ఇదే అన్ని మతాలలోకెల్లా శ్రేష్ఠమైన మతము.)

  • 28వ శ్లోకం

బౌద్ధ దర్శనం

మార్చు
  • కార్యకారణభావద్వా స్వభావద్వా నియామకాత్.

అవినాభావ నియమోదర్శనాంతరదర్శనాదితి.

నిప్పు (కారణము) మరియు పొగ (ప్రభావం) ల మధ్య ఉన్న విడదీయలేని సంబంధము నుండో, లేదా, గుర్తింపే నిర్ధారకము గా పరిగణించినపుడో, కలిగే ఫలితమే అవినాభావసంబంధము యొక్క సూత్రము.
అంతే కానీ, ఇటువంటి సందర్భాలలో కేవలం కావలసిన ఫలితాన్ని గమనించటం వలనో, లేదా, ఇటువంటివి కాని సందర్భములలో ఫలితాన్ని గమనించకపోవటం వలనో కలుగదు

  • 1వ శ్లోకం
  • ప్రమాణాంతరసామాన్య స్థితిరన్యధియాం గతే:. ప్రమాణాంతర సద్భావ: ప్రతిషేధాచ్చ కస్యాచిదితి.

పరాక్రాంత చాత్ర సూరిభిరితి గ్రంథభూయస్త్వపరాదుపరభ్యతే.

సాధారణంగా ఆధారం యొక్క రూపాన్ని అంగీకరించటం అనేది దాని ఉనికి నుండి, అది ఇతరులకు అర్థమయ్యే దానిని బట్టి ఉంటుంది.
ఆధారం యొక్క రూపం యొక్క ఉనికి దానిని ప్రశ్నించేవాడి వద్ద నుండి మొదలవుతుంది

  • 3వ శ్లోకం
  • వర్షాతపాభ్యాం కిం వ్యోమ్నశ్చర్మణయస్తి తయో: ఫలం.

చర్మోపశ్చేత్ సోనిత్య: ఖథుల్యశ్చేదసత్ఫలం.

వర్షం, ఎండలతో ఆత్మకు ఏమి పని ఉన్నది? వాటి ప్రభావం మనిషి యొక్క చర్మము పైన మాత్రమే ఉంటుంది.
ఆత్మయే చర్మము వలె ఉన్నపుడు, వాటి ప్రభావం ఆశాశ్వతం. చర్మమే ఆత్మ వలె ఉన్నపుడు, దానిపై వాటి ప్రభావమనేదే ఉండదు

  • 7వ శ్లోకం
  • న సత: కారణపేక్షా వ్యోమాదేరివ యుజ్యతే. కార్యస్యా సంభవో హేతు: ఖపుష్పాదేరివాసత ఇతి.

వివిచ్యమానానాం స్వభావో నావధార్యతే. అతో నిరభిలప్యాస్తే నిస్వభావశ్చ దర్శితా ఇతి.
ఇదం వస్తు బలాయాతం యద్ వదంతి విపశ్చిత:. యథా యథార్థాశింత్వత్యంతే విశీర్యంతే తథా తథేతి చ. న క్వచిదపి పక్షే వ్యవతిష్ఠత ఇత్యర్థ:

కారణం యొక్క అవసరం ఉనికిలో ఉన్న (ఆకాశం వంటి) వాటికి సరితూగదు. (పుష్పాలు/ఆకాశం వంటి వాటికి) ప్రభావమే లేనిచో ఏ కారణము ప్రయోజనకరమైనది కాదు. అలంకారవతారం లో బుద్ధుడు అందుకే ఇలా అన్నాడు - మేధస్సుచే భేదమును గుర్తించగలిగిన వాటికి తత్త్వాన్ని నిర్ధారించలేము. అందుకే అటువంటివి వివరించలేనివిగా, తత్త్వమే లేని వాటిగా చూపించబడ్డాయి. ఉనికిలో ఉన్నదేదీ ఫలితమును తప్పించుకొనలేదు. అందుకే మేధావులు ఉనికిలోనున్నదాని గురించి ఆలోచించిన క్షణమే అవి మాయమౌతాయి అని తెలిపిరి. మతపరమైన యాచకుడు, ప్రేమికుడు మరియు శునకములచే ఒకే స్త్రీ శవంగా, కామాన్ని తీర్చెడిదిగా మరియు మాంసపు ముద్దగా మూడు విధములుగా అర్థం చేసుకొనబడుతుంది.

  • 16వ శ్లోకం

ఆర్హత దర్శనం

మార్చు


  • సర్వజ్ఞఓ దృశ్యతే తావన్నేదానీమస్మదాదిభి:

దృష్టోన చైకదేశోస్తి లింగ వా యోనుమాపయేత్

ఈ ప్రపంచంలో మన/ఇతరుల ఏ జ్ఞానము వలనగానీ సర్వాంతర్యామి యొక్క దర్శనము కలుగలేదు. అతని ఉనికిని తెల్పెడు ఏ ఒక్క చిహ్నము సైతం ఎక్కడా తారసపడలేదు.

  • 8వ శ్లోకం
  • కర్తోస్తి నిత్యో జగత: స చైక:

న స్వర్గ: సన్ స్వవశ: స సత్య:.
ఇమా: కుహేయా: కువిడంబనా: స్యు
స్తేషాం న యేషామనుశాసకసత్వమితి

ఈ ప్రపంచం యావత్తుకీ ఒకే సృష్టికర్త కలిగి ఉండవచ్చుగాక! అతడు సర్వాంతర్యామి అయి ఉండవచ్చునుగాక! స్వతంత్రుడై ఉండవచ్చుగాక. అతనే పరమ సత్యం అయ్యి ఉండవచ్చును గాక! కానీ ఏయే శక్తులైతే నీవు అతనికి ఉన్నవని ప్రబోధిస్తున్నావో, అవి ఆయనలో లేవు. ఇవన్నీ నీ కల్పితాలే!

  • 22వ శ్లోకం
  • కర్తా న తావదిహ కోపి యథేచ్ఛయా వా

దృష్టోన్యథా కటకృతావమపి తత్ప్రసంగ:.
కార్య కిమత్ర భవతాపి చ తక్షకాద్యై
రాహత్య చ త్రిభువనం పురుష: కరోతీతి

ఒకవేళ సృష్టికర్తే గనుక ఈ సృష్టికి కారణభూతుడైతే, అతని ప్రభావం, కేవలం ఒక మతాన్ని సృష్టించటం వరకే పరిమితం కాదు. ఈశ్వరుడే గనుక ముల్లోకములను సృష్టిస్తూ ఉంటే, ఇక మీ వలన గానీ, కళాకారుల వలన గానీ ప్రయోజనమేమిటి?

  • 23వ శ్లోకం

రామానుజ దర్శనం

మార్చు


  • ఈశ్వరశ్చిదచిచ్చేతి పదార్థత్రితయం హరి:

ఈశ్వరశ్చిత్ ఇత్యుక్తో జీవో దృశ్యమచిత్ పున:

భగవంతుడు, ఆత్మ, నిరాత్మ: ఇవే మూడు సూత్రాలు. విష్ణువే భగవంతుడు, వ్యక్తులే ఆత్మలు, కంటికి కనబడే ప్రపంచమే నిరాత్మ.

  • 8వ శ్లోకం
  • జీవం దేవాదిశబ్దే వదతి తదపృథక్ సిద్ధభావాభిధానం

నిష్కర్షాకూతయుక్తో బహురిహ చ దృఢో లోకవేదప్రయోగ:
ఆత్మసంబంధకాలే స్థితిరనవగతా దేవమర్త్యాదిమూర్తిర్
జీవాత్మానుప్రవేశాజ్జగతి విభురపి వ్యాకరోన్నామరూపే

దేవుడు, మరియు అటువంటి పదాలు, ఇప్పటికే ఉటంకించినట్లు, ఆత్మనే సూచిస్తాయి తప్ప మరి దేనినీ కాదు. వ్యావహారికంలోను, వేదాలలోను అనుమానానికి తావులేని ప్రాముఖ్యత కలిగిన నిదర్శనాలు. చరాచరాలలో ఆత్మ నుండి ఉనికి వేర్పడినపుడు ఏమౌతుందో తెలియదు. ఒక్కో ఆత్మలోకి ప్రవేశించేటపుడు, అనంతం అనెడిది నామరూపాలలో వైవిధ్యాన్ని సంతరించుకొన్నది.

  • 28వ శ్లోకం
  • భిద్యతే హృదయగ్రంథిశ్చద్యంతే సర్వసంశయా:

క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే

ఆతని హృదయబంధాలు తెగిపోవును, ఆతని సందేహాలన్నీ తొలగిపోవును
ఆతని కర్మలన్నీ పూరింపబడును, ఎప్పుడైతే ఆతను ఉచ్చనీచాలు చూస్తాడో

  • 58వ శ్లోకం

పూర్ణప్రజ్ఞ దర్శనం

మార్చు


  • స్వతంత్రమస్వతంత్రంచ ద్వివిధం తత్త్వమిప్యతే

స్వతంత్రో భగవాన్ విష్ణుర్నిర్దోషోశేషసద్గుణ ఇతి


స్వతంత్రము, అస్వతంత్రము అనెడి రెండు సిద్ధాంతాలు కలవు
అస్వతంత్రమే శ్రీమహావిష్ణువు, లోపాలకు అతీతుడు, కొదవలేని ఘనతలు గలవాడు

  • 1వ శ్లోకం


  • ఘాతయంతి హి రాజానో రాజాహమితి వాదిన:

దదత్యఖిలమిష్టం చ స్వగుణోత్కర్షవాదినాం ఇతి

రాజులం అని చెప్పుకొనేవారిని ఇతర రాజులు నాశనం చేస్తారు
తమ రాజసాన్ని ప్రకటించేవారిని, వారికి అనుగుణంగా ఉండేవారిని సత్కరిస్తారు

  • 8వ శ్లోకం
  • అనాదిద్వేషిణో దైత్యా విష్ణోర్ద్వేషో వివర్ధిత:

తమస్యంధే పాతయతి దైత్యానంధే వినిశ్చయాదితి

ఓ దైత్యులారా! సృష్టికే శత్రువులారా! విష్ణువు ఆగ్రహకారకులారా!
విష్ణువు మిమ్ములను గాఢాంధకారం లోనికి తోసివేయు గాక! మీరు గుడ్డిగా నిర్ణయాలు చేస్తారు గనుక.

  • 9వ శ్లోకం
  • ద్వైతం న విద్యత ఇతి తస్మాదజ్ఞానినాం మతం

మతం హి జ్ఞానినామేతాన్మితం త్రాతం హి విష్ణునాం
తస్మాన్మాత్రమితి ప్రోక్తం పరమో హరిరేవ త్విత్యాది

ఎవరైతే ద్వైతం ఆమోదయోగ్యం కాదని తెలిపెదరో వారు అజ్ఞానులు.
ద్వైతమే జ్ఞానల మతము.
స్వయంగా శ్రీ మహావిష్ణువే ద్వైతానికి కర్త.

  • 26వ శ్లోకం

శైవ దర్శనం

మార్చు
  • త్రిపదార్థ చదుష్పాదం మహాతంత్ర జగద్గురు:

సూత్రేణైకే న సంక్షిప్య ప్రాహ విస్తరత: పునరితి.

ప్రపంచానికే గురువు (శివుడు), మహాతంత్రం అనే సూత్రంలో తనను తాను ఇనుమడింపజేసుకొని మూడు విభాగాలు (అధిపతి, పశుసంపద, బంధం)గా మరియు నాలుగు పాదాలు (అభ్యాసం, ఉత్సవ కార్యాలు, ధ్యానం మరియు నైతికతలు)గా వర్గీకరించబడి, పూర్తి స్థాయిలో మరల తనను తాను పునర్నిర్వచించుకొనెను.

  • 1వ శ్లోకం
  • అజ్ఞఓ జంతురనీశోయమాత్మన: సుఖదు:ఖయో:

ఈశ్వరప్రేరితో గచ్ఛేత్స్వర్గం వా శ్వభ్రమేవవా.

ఏది సుఖమో ఏది దు:ఖమో తేల్చుకోలేని ఈ జీవాత్మ దైవనిర్దేశము కలిగి ఉన్నచో ఎప్పటికీ స్వర్గానికి గానీ, ఎప్పటికీ నరకానికి గానీ పోవును.

  • 6వ శ్లోకం
  • ఇహ భోగ్యభోగసాధనతదుపాదానాది యో విజానాతి

తమృతే భూతన్నహీదం పుంస్కర్మాశయవిపాకజ్ఞమితి

ఎవరైతే భోగాలు, భోగ్యాలు, వాటి సాధనాలు, ఉపాదనాదులు ఎరిగియుందురో వారు తప్పితే పురుషుని కర్మాశయాలు వాటి ఫలాల విషయాలు మరెవ్వరు ఎరగరు..

  • 8వ శ్లోకం
  • వివాదాద్యాసితం సర్వం బుద్ధిమత్పూర్వకర్తృకం.

కార్యత్వాదావయో: సిద్ధం కార్యం కుంభాదికం యథేతి

మా వాదంలో సృష్టి ఒక అంశం. ఇది సృష్టికర్తచేతనే సృష్టించబడి ఉండాలి. ఇతర ప్రభావాలవలె సృష్టి కూడా ఒక ప్రభావమే కావున, ఈ విధంగా మ వాదనను మేము సమర్థించుకొంటున్నాం.

  • 9వ శ్లోకం
  • సర్వజ్ఞ: సర్వకర్తృత్వాత్ సాధనాంగఫలై: సహ

యో యజ్జనాతి కురుతే స తదేవేతి సుస్థితమితి

అతను సర్వసృష్టికర్త అనునది జగద్విదితం. కావున అతను సర్వజ్ఞాని. ఆదిమధ్యాంతాలు తెలిసినవాడు మాత్రమే దేనినైనా సృష్టించగలడు.

  • 10వ శ్లోకం
  • ఆకారవాంస్త్వం నియమాదుపాస్యో

న వస్వనాకారముపైతి బుద్ధి

నియమానుసారం నీవు (శివుడు) ఆకారంలోనే పూజించబడతావు. బుద్ధి రూపంలేనిదానిని అర్థం చేసుకోలేదు గనుక.

  • 14వ శ్లోకం

ప్రత్యభీజ్ఙ దర్శనం

మార్చు
  • భక్తిలక్ష్మీసముద్ధానాం కిమన్యదుపయాచితం.

ఏతయా వా దరిద్రాణాం కిమయందపయాచితం.

భక్తి అనెడి ఐశ్వర్యం కలిగినవారు, ఇక అంతకంటే ఏమి కోరగలరు? ఈ ఐశ్వర్యం లేనివారు, దీనిని కాక మరేమి కోరగలరు?

  • 7వ శ్లోకం


  • యా చైషాం ప్రతిబభా తత్తత్పదార్థక్రమరూపితా.

అక్రమానందూచిద్రప: ప్రమాతా స మహేశ్వర: ఇతి చ.

వీటి యొక్క జ్ఙానము, వాటి యొక్క జ్ఙానము పిదప సంభవిస్తుంది. ఎవ్వరికైతే ఇది తెలియునో, ఎవ్వరి సారాంశమే మోక్షమో, ఎవ్వరికైతే అనంతమైన జ్ఙానము కలదో, అతనే మహేశ్వరుడు

  • 13వ శ్లోకం


  • సదా శివాత్మనా వేత్తి సదా వేత్తి మదాత్మనా ఇత్యాది.


ఎల్లప్పుడూ శివుణ్ణి గుర్తించినవాడే, ఎల్లప్పుడూ తనకు తాను తెలిసి ఉంటాడు.

  • 14వ శ్లోకం
  • తదైక్యేన వినా నాస్తి సంవిదాం లోకపద్ధతి:.

ప్రకాశైక్యాత్తదేకత్వం మాతైక: స ఇతి స్థితి:..

శివునిలో ఐక్యమయ్యే వరకూ జ్ఞానశక్తి జనాదరణ పొందదు.
దైవం తో ఐక్యం వెలుగుతో ఐక్యమే. అతనే సర్వజ్ఙాని. అతనే అన్ని జ్ఙానశక్తులను మేల్కొల్పువాడు

  • 15వ శ్లోకం


  • నిరుపాదానసంభారమభిత్తావేవ తన్వతే

జగచ్చిత్రం నమస్తస్మై కలానాథాయ శూలినేతి

ఏ రంగులూ లేకనే, ఏ గోడ లేకనే, ఏ పటము లేకనే, ఏ ముడిపదార్థములు లేకనే ఈ ప్రపంచమను చిత్రపటము గీసినవాడికి, చంద్రకాంతితో మెరిసేవాడికి, త్రిశూలాన్ని ధరించినవాడికి నా గౌరవమును వెలిబుచ్చుతున్నాను.

  • 22వ శ్లోకం

రసేశ్వర దర్శనం

మార్చు
  • ఇతి ధనశరీరభోగాన్మత్వానిత్యాన్సదైవ యతనీయం.

ముక్తౌ సా చ జ్ఞానాత్తచ్చాభ్యాసాత్స చ స్థిరే దేహేతి.

ఐశ్వర్యం ఇచ్చెడి భోగభాగ్యాలు ఐహిక సుఖాలు శాశ్వతం కావు. ముక్తి అనెడిది జ్ఙానం ద్వారా, జ్ఙానం అనెడిది అభ్యాసం ద్వారా, అభ్యాసం అనెడిది ఆరోగ్యకరమైన శరీరంలోనే సాధ్యమౌతాయి.

  • 5వ శ్లోకం
  • అభ్రకస్తవ బీజం తు మమ బీజం తు పారద:.

అనర్యోర్మేలనం దేవి మృత్యుదారిద్రయనాశనమితి.

అభ్రకం నీ బీజం, పాదరసం నా బీజం. ఈ రెండింటి కలయిక, ఓ దేవీ, మృత్యువు మరియు దారిద్ర్యాన్ని కలిగించే వినాశకారి.

  • 7వ శ్లోకం

ఔలూక్య దర్శనం

మార్చు
  • ఆగమేనానుమానేన ధ్యానాభ్యాసవలేన చ.

త్రిధా ప్రకల్పయన్ ప్రజ్ఙా లభతే యోగముక్తమమితి.

గ్రంథం, అనుమితి మరియు ధ్యానం. జ్ఙానాన్ని ప్రసాదించే ఈ మూడు విధానాలతోనే మనిషి పరమాత్మతో ఐక్యం (యోగం) పొందుతాడు.

  • 2వ శ్లోకం

అక్షపాద దర్శనం

మార్చు
  • ప్రయోజనముద్దిశ్య న మందోపి ప్రవర్తతే.

జగచ్చాసృజతస్తస్య కిం నామ న కృతం భవోద్.

ఏదో ఒకటి కంటికి కనబడితే గానీ, తెలివిలేనివాడైనను ముందుకెళ్ళడు. ఒకవేళ భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించకపోతే, ఏది అతనిచే అసంపూర్తిగా వదిలివేయబడ్డది?

  • 66వ శ్లోకం

జైమినీయ దర్శనం

మార్చు
  • తదుదితముదయనేన -

భావో యథా తథాభావ: కారణం కార్యవన్మనమితి.

ఉనికి గలది ఎలా అయితే కారణంగా మరియు ప్రతిఫలంగా పరిగణించబడుతోందో ఉనికి లేనిది కూడా అలానే పరిగణించబడాలి.

  • 70వ శ్లోకం

పాణిని దర్శనం

మార్చు
  • తదాహుర్వేదాంత వాదనిపుణా:-


యథా స్వప్నప్రపంచోయం మయి మాయా విజృంభిత:.
ఏవం జాగ్రత్ప్రపంచోపి మయి మాయా విజృంభిత ఇతి.

ఎలా అయితే యావత్ స్వాప్నిక ప్రపంచం నా పైనున్న భ్రమలతోనే నిర్మించబడిందో, అలానే మెలకువ గా ఉన్న ఈ యావత్ (వాస్తవ) ప్రపంచం కూడా నా పైనున్న భ్రమలతోనే నిర్మించబడింది.

* 53వ శ్లోకం

  • తదుక్తం -

తద్ర ద్వారమపవర్గస్య వాంగ్మలానాం చికిత్సితం.
పవిత్రం సర్వవిద్యానామదివిధం ప్రచక్షత ఇతి

అందుకే చెప్పబడింది - ముక్తికి అది ద్వారం (మార్గం) అని చెబుతారు. వాక్కులో కలిగే అనారోగ్యన్ని హరించే ఔషధంగా చెబుతారు. అన్ని శాస్త్రాలను శుద్ధి చేసే శాస్త్రంగా, శాస్త్రాలకే శాస్త్రంగా దానిని (వ్యాకరణాన్ని) చెప్పుకొంటారు.

  • 54వ శ్లోకం

సాంఖ్య దర్శనం

మార్చు
  • యథోక్తం -


రంగస్య దర్శయిత్వా నివర్తతే నర్తకీ యథా నృత్యాత్.
పురుషస్య తథాత్మానాం ప్రకాశస్య వినివర్తతే ప్రకృతిరితి.

ఎలా అయితే నర్తకి తన నాట్యాన్ని వీక్షకులకు ప్రదర్శించిన తర్వాత రంగస్థలం నుండి ఉపక్రమిస్తుందో, ఆత్మను ప్రకాశితం చేసిన తర్వాత ప్రకృతి కూడా ఉపక్రమిస్తుంది.

* 31 వ శ్లోకం




 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.