సిరివెన్నెల సీతారామశాస్త్రి

సిరివెన్నెల సీనిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చెంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత.

స్వర్ణకమలం సినిమా నుండి

పడమటి పడగలపై వెలిగే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరి

మహాత్మా సినిమానుండీ

మహాత్మా గాంధీ గురుంచి

కరన్సీ నోట్ల మీద,
ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ

ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
కొంతమంది ఇంటి పేరు కాదుర గాంధీ
తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ

W:రుద్రవీణ సినిమానుండి

తరలిరాద తనే వసంతం
తన దరికిరాని వనాలకోసం.

నటరాజ స్వామి జటాఝాటి లోకి చేరకుంటె
విరుచుకు పడు సుర గంగ కు విలువేముంది ?


అలలకు అందునా, ఆశించిన ఆకాశం ?
కలలా కరగడమా, జీవితాన పరమార్థం ?


గగనాల దాకా అలసాగకుంటె
మేఘాల రాగం ఇల చేరుకోదా ?


శృతిలయలు సినిమా నుండి

చెలువమునేలగ చెంగటలేవని
కలతకు నెలవై నిలిచిన నెలతకు
కలలలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి అలమేలు మంగకు ... తెలవారదేమో స్వామీ


గగన గళము నుండి అమర గానవాహిని
జాలు వారుతోంది ఇలా అమృత వర్షిణి


లయకే నిలయమై నీ పాదం సాగాలి
మలయానిల గతి లొపల సుమబాలగ తూగాలి


రస ఝరులు జాలు వారే నృత్యం గూర్చి

మువ్వలు ఉరుముల సవ్వడులై
మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై,
మేని విసురు వాయు వేగమై


నిందా స్తుతి

ఆది భిక్షువువానినేమి అడిగేది, బూడిదిచ్చేవాడినేది కోరేది తీపి రాగాల కోకిలమ్మకు నల్లరంగులలమిన వాడి నేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది ఆడిగేది

బయటి లింకులు మార్చు

 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.

chakram nundi