సోక్రటీస్
గ్రీకు తత్వవేత్త
సోక్రటీస్ (ఆంగ్లం: Socrates; గ్రీకు: Σωκράτης, Sōkrátēs; c. 469 BC) ( క్రీ.పూ 470 - క్రీ.పూ 399) గ్రీకు దేశంలోని ఏథెన్సుకు చెందిన తత్వవేత్త. పాశ్చాత్య తత్వానికి ఆద్యునిగా భావిస్తారు. ఈయన సృష్టించిన సోక్రటీసు విధి/పద్దతి చాలా ప్రాచుర్యం చెందినది. ఈయన సృష్టించిన తత్వశాస్త్ర విధానంలో సాగే భోదనా విధానంలో ఉపాధ్యాయుడు అడిగే ప్రశ్న విద్యార్థి మనసులోని మంచి సమాధానాన్ని, ప్రాథమిక భావనల్ని బయల్పరిచేదిగా ఉండాలి.
సోక్రటీసు పాశ్చాత్య తత్వశాస్త్రం పై బలమైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ప్లేటో, మరియు అరిస్టాటిల్ పై ఈయన ప్రభావం ఎంతో ఉంది. నీతి నియమాలు, తర్క శాస్త్రం లో ఈయన ఎనలేని కృషి చేశాడు.
సోక్రటీస్ ప్రముఖ ప్రవచనాలు
మార్చు- తినడం కోసం జీవించడం కాకుండా జీవించడం కోసం తినాలి.
- తనను గూర్చి తనకే తెలియనివాడే నిజమైన అజ్ఞాని.
- సంతృప్తి సహజ సంపద. ఆడంబరం కృత్రిమ దారిద్ర్యం.
- భోగభాగ్యాలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మటుకు అభిమానాన్ని, ఆశీర్వచనాలను తీసుకువస్తుంది.
- మృత్యువును తప్పించుకోవడం పెద్ద విషయం గాదు. తప్పుచేయకుండా తప్పించుకోవడం గొప్ప విషయం.
- ఇతరులు నోళ్లు మూయించడానికి ప్రయత్నించేకన్నా నీ మంచితనాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించడం మేలు.
- ఎలాగో ఒకలా బ్రతకడం కాదు కావలసింది - ఎలా బ్రతుకుతున్నాం అన్నది కూడా ముఖ్యం.
- తార్కికంగా యోచించి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయాన్ని తీసుకుని దానికి అనుగుణంగా మన ఆలోచన నిర్ణయించుకుంటూ పోకూడదు.
- మనుషులను గాయపరచడం ఎంత తప్పో, మనసులను గాయపరచడం కూడా అలాంటి తప్పే.
- ఒక తప్పు మరొక తప్పువల్ల సరిచేయబడదు.
- సంతోషంతో ,తృప్తిగా జీవించే మనిషికి సహజమైన సిరిసంపదలు లభించినట్లే.
- తృప్తి సహజ సిద్ధమైన సంపద,భోగం కృత్రిమమైన బీదరికం.
- న్యాయమూర్తికి కావలసినవి నాలుగు లక్షణాలు. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానమివ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయించటం.
- మీ లక్ష్యం ఎల్లప్పుడూ ఉన్నతమైనదిగానే ఉండవలెను.
- నీ తెలివిని, నీ తపనను ఇతరులకు తెలియ చేయి, వాటిని నీవు తెలియచేయకుంటే అవి నిన్నే నాశనం చేస్తాయి.
- తనకే గుర్తింపు ఉండాలని, అందరి దృష్టి తానే ఆకర్షించాలని మూర్ఖుడు అనుకుంటాడు. కానీ విజ్ఞుడు సభాంగణంలో కూడా వినయముగానే ఉంటాడు.
- బ్రహ్మచారికి సుఖం లేదు, గృహస్తుకు శాంతి లేదు. ఏ దారి ఎంచుకున్నా పశ్చాత్తాప్త పడక తప్పదు. అలాటప్పుడు పెళ్లి చేసుకోవడమే కొంచెం నయం.
- అందం అధికారం తక్కువ కాలమే.
- తనను గూర్చి తనకే తెలియనివాడు అజ్ఞాని.
- అదృష్టంపై ఎన్నడు ఆధారపడకు.
- తాత్విక అనుభవం అద్భుతమైనది. తత్వశాస్త్రం అద్భుతంతోనే మొదలయ్యింది.
- ఆహారానికి మంచి రుచిని తెచ్చేది ఆకలి.
- పరీక్షించుకొనని జీవితం నిరర్ధకం.
- నీ అభిలాషను బట్టి నువ్వు కనిపించడంపై కీర్తి ఆధారపడి ఉంటుంది.
- వీరోచిత కార్యాల సుగంధమే కీర్తి.
- ఘనమైన పనులు చేసినవారికి కీర్తి సుగంధం వంటిది.
- మన కోరికలు తగ్గేకొద్దీ దేవునితో పోలికలు దగ్గరవుతాయి.
- నేను అవివేకినినని తప్ప నాకు తెలిసిందేమిలేదు.
- పరీక్షించలేని జీవితం జీవించ తగ్గది కాదు.
- మృత్యువును తప్పించుకోవడం గొప్ప విషయం కాదు. తప్పు చేయకుండా తప్పించుకోవడమే గొప్ప.
- మనుషులను గాయపరచడం ఎంత తప్పో మనసులను గాయపరచడం కూడా అంతే తప్పు.
- పదాల నిర్వచనమే తెలివికి మొదలు.
- నగర జీవనం త్రొక్కిసలాట,అధిక వ్యయం.
- నేను పౌరుణ్ణి, ఏథెన్స్ కాదు గ్రీస్ కాదు ప్రపంచ పౌరుణ్ణి.
- మన ప్రార్ధనలు దేవుని ఆశిర్వచనాల కొరకే. దేవుడికి మనకు ఏది మంచో తెలుసు.
- మంచి మనిషికి ఏ హాని జరుగదు. బ్రతికుండగా కాని చనిపోయిన తర్వాతన కాని.
- మంచంటే జ్ఞానం,చేదంటే అజ్ఞానం.
- యువకులపై దృష్టి సారించండి,వారిని సాధ్యమైనంత మంచివారిగా మార్చండి.
- ఓ ధనవంతుడు తన సంపద చూసి మురిసిపోతే అతడు ఎలా దాన్ని ఉపయోగిస్తున్నాడో తెలిసే వరకు అతన్ని ఎవరు పొగడరు.
- ఒకప్పుడు పురుషునితో సమానమైన స్త్రీలు తర్వాత పురుషుణ్ణి అధిగమించారు.[1]