స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్
స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్, ఫాస్, ఓపెన్ సోర్స్ అనేవి వినియోగదారులు సాఫ్ట్‌వేర్‌ని ఏ వినియోగానికైనా పనికివచ్చేలా పంపిణీచేయబడింది. స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్‌లను వినియోగదారులు స్వేచ్ఛగా కాపీలను పున:పంపిణీ చేసుకుని దాని సోర్సును పరీక్షించవచ్చు, అధ్యయనం చేయవచ్చు, వినియోగానికి ఉపకరించేలా మార్పులుచేయవచ్చు.
వ్యాఖ్యలు
మార్చు- “స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్”(Free software), స్వేచ్ఛకు, స్వాతంత్ర్యానికి సంబంధించిన విషయం, తప్ప ధరకు సంబంధించింది కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకునేందుకు, ఫ్రీ సాఫ్ట్వేర్లలో ఫ్రీ అనే పదాన్ని వాక్ స్వాతంత్రం(free speech) అర్థంలో చూడాలి తప్ప, ఉచితంగా మద్యం(free beer)లో కాదు.
- వాట్ ఈజ్ ఫ్రీ సాఫ్ట్‌వేర్(What is free software?) ద ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్.
- సాఫ్ట్‌వేర్ వినియోగ మార్గసూచీలు(software manuals) కూడా స్వేచ్ఛగా లభ్యమవ్వాలి. ఎందుకంటే-ఎందుకు సాఫ్ట్‌వేర్ స్వేచ్ఛగా లభించాలంటున్నామో అందుకే. ఎందుకంటే-వినియోగ మార్గసూచీలు సాఫ్ట్వేర్లో ప్రభావశీలమైన భాగం కనుక. ఇదే వాదం వినియోగానికి మార్గసూచీలుగా ఉండే ఇతర పుస్తకాలకు కూడా వర్తిస్తుంది.