హొ చి మిన్
హొ చి మిన్ (Ho Chi Minh) (మే 19, 1890 - సెప్టెంబరు 3, 1969) వియత్నాం సామ్యవాద నాయకుడు, ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. ఇతని అసలు పేరు గుయెన్ టాట్ థన్. [1]
వ్యాఖ్యలు
మార్చు- స్వాతంత్ర్యం, స్వేచ్ఛ కంటే విలువైనది ఏదీ లేదు.[2]
- మేము చంపిన ప్రతి ఒక్కరికీ మీరు మా మనుషుల్లో పది మందిని చంపగలరు. కానీ ఆ విపత్కర పరిస్థితుల్లోనూ మీరు ఓడిపోతారు, మేం గెలుస్తాం.
- నన్ను ప్రేరేపించింది కమ్యూనిజం కాదు, దేశభక్తి.
- వియత్నామీస్ ప్రజలు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, శాంతిని గాఢంగా ఇష్టపడతారు. కానీ అమెరికా దురాక్రమణ నేపథ్యంలో వారు ఏకతాటిపైకి వచ్చారు.
- మిమ్మల్ని మీరు ప్రేమించినట్లే ఇతర వ్యక్తులను ప్రేమించండి.