ఆత్రేయ
నాటక, సినీ గీత, కథా రచయిత
ఆచార్య ఆత్రేయ (Acharya Atreya) గా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు (1921 - 1989) తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు.
సినిమా పాటలు
మార్చు- ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము - జీవన తరంగాలు
- ఈనాటి ఈ బంధమేనాటిదో... ఏనాడు పెనవేసి ముడివేసెనో
- కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా
నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో - తోడికోడళ్ళు - చిటపట చినుకులు పడుతూ వుంటే చెలికాడే సరసన ఉంటే
చెట్టాపట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటె
చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ వుంటుందోయి - ఆత్మబలం - నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి... ఏ కన్నీరెనకాల ఏముందో తెలుసునా
- పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా
- పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు
కనిపించని ఆశలవిందు మనసునే మరపించు గానం మనసునే మరపించు - పెళ్ళి కానుక - భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికీ జేజేలు - బడిపంతులు
- మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే - ప్రేమనగర్