నందమూరి తారక రామారావు
(ఎన్టీరామారావు నుండి మళ్ళించబడింది)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు 1923, మే 28న కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో జన్మించాడు. 300పైగా చలన చిత్రాలలో నటించి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. 3 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1996, జనవరి 18న మరణించాru.
ఎన్టీ రామారావు యొక్క ముఖ్య వ్యాఖ్యలు
మార్చు- అన్నం లేని దేశంలో ఆసియా క్రీడలా! [1]
- తెలుగుదేశం పార్టీ నాతోనే వచ్చింది, నాతోనే పోతుంది.[2]
- ఆరు లక్షల ఉద్యోగుల కోరికల కోసం ఆరు కోట్ల ప్రజల భవిష్యత్తును నాశనం చేయడానికి నేను మూర్ఖుడిని కాను.[3](ఉద్యోగుల సమ్మె సందర్భంగా ఎన్టీయార్ ఆవేశంతో అన్న మాటలు)
- సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు
మూలాలు
మార్చు- ↑ 1982లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆసియా క్రీడలను నిర్వహించు సమయంలో ఎన్టీయార్ చేసిన విమర్శ
- ↑ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరామారావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 180
- ↑ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరామారావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 179