కొచెరిల్ రామన్ నారాయణన్ (1921 ఫిబ్రవరి 4 - 2005 నవంబరు 9) భారతదేశ 10వ రాష్ట్రపతి. అతను ఉఝుపూర్ లోని ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. పాత్రికేయుడిగా కొంతకాలం పనిచేసిన తర్వాత, ఉపకార వేతనం సహాయంతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో రాజకీయ శాస్త్రాన్ని అధ్యయనం చేసాడు. నెహ్రూ ప్రభుత్వంలో భారత విదేశాంగ శాఖలో ఉద్యోగిగా నారాయణన్ తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. నారాయణన్ ప్రతిభను గుర్తించిన జవహర్ లాల్ నెహ్రూ ఆయనను రంగూన్ లోని భారత విదేశాంగ శాఖలో భారతదేశ ప్రతినిధిగా నియమించాడు. అతను జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్‌, థాయ్‌లాండ్, టర్కీ, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు దేశాలలో భారత రాయబారిగా పనిచేసాడు. అమెరికాలో భారత రాయబారిగా 1980 నుండి 1984 వరకూ నాలుగేళ్ళు పనిచేసాడు. అతనిని దేశంలో అత్యుత్తమ దౌత్యవేత్తగా నెహ్రూ పేర్కొన్నాడు. [1]

కె.ఆర్. నారాయణన్

వ్యాఖ్యలు

మార్చు
  • ఓషో వంటి జ్ఞానవంతులు వారి కాలం కంటే ముందుంటారు. ఇప్పుడు మరింత మంది యువత ఆయన రచనలు చదవడం శుభపరిణామం.[2]
  • హోమియోపతి చికిత్స నాకే కాదు, నా కుటుంబానికి కూడా నా మొదటి ఎంపిక. హోమియోపతిని పూర్తి స్థాయి ప్రత్యామ్నాయ వైద్య విధానంగా అభివృద్ధి చేయాలి. హోమియోపతి మరింత ప్రాచుర్యం పొందడానికి, ఉపయోగకరమైన హోమియోపతి వారి రోగులకు మరింత దయతో చికిత్స చేయడానికి మరింత పరిశోధన, మరింత అభివృద్ధి అవసరం. హోమియోపతి భారతదేశంలో ఆచరణలో ఉన్న రెండవ అతిపెద్ద వైద్య విధానం.[3]
  • ఎవరైనా నన్ను అవమానిస్తే, అతని పట్ల నాకు అంతులేని జాలి మాత్రమే కలుగుతుంది.
  • భారతీయ ప్రజానీకం వారి సమస్యలతో తూకం వేయబడుతుంది, వారి స్వంత సమస్యలపై దృష్టి పెట్టడం వల్ల వారి దృక్పథంలో నిస్సహాయంగా ఉంటారు. ప్రపంచంలో ఒక భాగంగా, ఆసియాలో భాగంగా మాత్రమే మనం పురోగమించగలమన్న స్పృహ వారిలో కలిగించాలి.
  • ఆరోగ్యం, సామాజిక పురోగతికి విద్య కీలకం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతీయుడి సగటు జీవితంపై అంచనాలు రెట్టింపయ్యాయన్నది వాస్తవం. నిజానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి 28, 30 ఏళ్లు ఉంటే ఇప్పుడు 61 ఏళ్లు.


మూలాలు

మార్చు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.