సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ వ్రాసిన దేవదాసు నవల భారతీయ సినిమా నిర్మాతలకు ఎంతో ఇష్టమైన చిత్ర కథ అయ్యింది.

1950 దశకంలో తెలుగు సినిమా మంచి ఉచ్ఛదశలో ఉంది. అప్పుడు విడుదలైన దేవదాసు ఎన్నో విధాలుగా చరిత్ర సృష్టించింది. శరత్ బాబు నవలను తెలుగులోకి అనువదించి చక్రపాణి ఈ చిత్రాన్ని నిర్మించాడు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వానికి, అక్కినేని, సావిత్రిల నటనకు, ఘంటసాల గానానికి ఈ సినిమా చరిత్రలో మచ్చుతునకగా నిలిచి పోయింది. భగ్న ప్రేమికులకు "దేవదాసు" అనే పదంతెలుగు సాహిత్యంలో భాగమైపోయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు సుబ్బరామన్ కు అంకితమిచ్చారు.

సినిమా పాటలు

మార్చు
  • అందం చూడవయా ఆనందించవయా - సముద్రాల రాఘవాచార్య
  • కల ఇదని నిజమిదని తెలియదులే బతుకింతేనులే - సముద్రాల రాఘవాచార్య
  • కుడి ఎడమైతె పొరపాటు లేదోయ్ - సముద్రాల రాఘవాచార్య
    • లాహిరీ నడి సంద్రములోనా, లంగరుతో పని లేదోయ్
  • జగమే మాయ బ్రతుకే మాయ - సముద్రాల రాఘవాచార్య
    • కలిమి లేములు కష్టసుఖాలు కావడిలో కుండలనే భయమేలోయి, కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
    • ఆశా మోహములా దరి రానీకోయీ, అన్యులకే నీ సుఖము అంకితమోయీ
    • బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్, ఆ ఎరుకే నిశ్చలనాందమోయ్, బ్రహ్మానందమోయ్
  • ఓ దేవాదా! చదువు ఇదేనా, మనవాసి వదిలేసి సిసలు దొరల్లే సూటూ,బూటా?
  • అంతా భ్రాంతియేనా జీవితాన సుఖమింతేనా
    • చిలిపి తనాల చెలిమే మరిచితివో
"https://te.wikiquote.org/w/index.php?title=దేవదాసు&oldid=13446" నుండి వెలికితీశారు