నర్తనశాల (ఆంగ్లం: NarthanaSala) మహాభారతంలోని విరాట పర్వం కథాంశం ఇతివృత్తంగా నిర్మితమై 1963 సంవత్సరములో విడుదలైన తెలుగు సినిమా. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో దర్శకులకున్న ప్రతిభను ఈ సినిమా మరొక్కసారి ఋజువు చేసింది. నటులు, దర్శకుడు, రచయిత, గీత రచయిత, సంగీత కళాదర్శకులు - ఇలా అందరి ప్రతిభనూ కూడగట్టుకొని ఈ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది. ఈ సినిమా రాష్ట్రపతి బహుమానాన్ని, నంది అవార్డును గెలుచుకొంది. 1964లో ఇండొనీషియా రాజధాని, జకార్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు (ఎస్. వి. రంగారావు), ఉత్తమ కళాదర్శకుడు బహుమతులు గెలుచుకొంది.

పాటలు, పద్యాలు

మార్చు
  • ఎవరికోసం చెలి మందహాసం ఒకపరి వివరించవే
  • జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి...సముద్రాల రాఘవాచార్య
  • బావా బావా పన్నీరు
  • దరికి రాబోకు రాబోకు రాజా
  • సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి
  • సలలిత రాగసుధారససారం
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=నర్తనశాల&oldid=17176" నుండి వెలికితీశారు