నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) చిత్తూరు జిల్లాకు చెందిన రాజకియ నాయకుడు. 1960, సెప్టెంబర్ 13న జన్మించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకరుగా పనిచేశారు. 2010 నవంబర్ 25 న ముఖ్యమంత్రి అయ్యారు.

కిరణ్ కుమార్ రెడ్డి యొక్క ముఖ్య వ్యాఖ్యలు మార్చు

  • ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన ముహుర్తం బాగా లేదనుకుంటాను[1]
  • విద్యార్థినులు జీవితంలో స్థిరపడ్డాకే వివాహం చేసుకోవాలి [2]
  • ఉద్యమాలతో తెలంగాణ రాదు.
  • దురాశపడితే ఎవరికైనా శ్రీకృష్ణజన్మస్థానమే దక్కుతుంది [3]
  • భయపడుతూ ఒకరికోసం బ్రతికేది బ్రతుకే కాదు [4]

కిరణ్ కుమార్ పై ఇతరులు చేసిన వ్యాఖ్యలు మార్చు

  • ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మూడు కాళ్ళ కుర్చీలో కూర్చున్నారు-- బీవీ రాఘవులు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి)[5]
  • కిరణ్ కుమార్ ప్రజల ముఖ్యమంత్రి కాదు, అధిష్టానం పంపిన సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి-- చంద్రబాబు నాయుడు[6]

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, తేది 16-04-2012
  2. సాక్షి దినపత్రిక, తేది 03-04-2012
  3. ఈనాడు దినపత్రిక, తేది 01-06-2012
  4. ఈనాడు దినపత్రిక తేది 15-11-2012
  5. ఈనాడు దినపత్రిక తేది 16-12-2012
  6. ఈనాడు దినపత్రిక తేది 24-11-2012
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.