తెలంగాణ
తెలంగాణ భారతదేశంలోని రాష్ట్రం. పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక భాగంగా ఉండేది. పూర్వపు నిజాం సంస్థానంలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రాంతమే తెలంగాణాగా పిలువబడుతున్నది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పరిధిలో 10 జిల్లాలు ఉన్నాయి.
తెలంగాణా పై ఉన్న వ్యాఖ్యలు
మార్చు- నా తెలంగాణ కోటి రతనాల వీణ -- దాశరథి కృష్ణమాచార్య.
- తెలంగాణ నినాదం కాదు, రాష్ట్రం-- బండారు దత్తాత్రేయ[1]
- బొందలగడ్డ తెలంగాణ వద్దు, భాగ్యాల తెలంగాణే కావాలి -- గద్దర్ [2]
- నేను కనుసైగ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది -- కె.చంద్రశేఖరరావు.
- గల్లీ పార్టీలతో తెలంగాణ రాదు, ఢిల్లీ పార్టీలతోనే సాధ్యం -- భాజపా
- రాజకీయ పొత్తులతో ఎప్పటికీ తెలంగాణ రాదు -- తెలంగాణ మేధావులు[3]
- తెలంగాణ తెచ్చేది తెరాస, ఇచ్చేది భాజపా, చచ్చేది కాంగ్రెస్ -- విజయశాంతి.
- తెలంగాణ వచ్చుడో, కెసీఆర్ సచ్చుడో -- కె.చంద్రశేఖరరావు
- సీమాంధ్ర సీఎంల వల్లే తెలంగాణకు అన్యాయం-- టి.హరీష్ రావు [4]
- ఉద్యమాలతో తెలంగాణ రాదు -- నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
- తెలంగాణాకు మద్దతినిచ్చే బొంత పురుగునైనా ముద్దుపెట్టుకుంటా -- కె.చంద్రశేఖరరావు.
- ఔర్ ఏక్ దక్కా, తెలంగాణ పక్కా -- సుష్మాస్వరాజ్
- తెలంగాణ విడిపోతే ఆంధ్ర, రాయలసీమ వారు హైదరాబాదులో విదేశీయులైపోతారు -- వై.ఎస్.రాజశేఖరరెడ్డి
- తెలంగాణ విషయంలో రెండుకళ్ళ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న చంద్రబాబుకు 2014 ఎన్నికల తర్వాత గుడ్డికన్నే మిగులుతుంది -- కిషన్ రెడ్డి (భాజపా రాష్ట్ర అధ్యక్షుడు)[5]
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బీజేపీ, సుష్మాస్వరాజ్ ద్వారా ఏర్పాటుకాకపోతే దెయ్యం ఏర్పాటు చేస్తుందా? -- జి.కిషన్ రెడ్డి [6]
- తెలంగాణలో అభివృద్ధి చూపిస్తే పరకాల చౌరస్తాలో చెప్పుదెబ్బలు తింటా.[7]
- సిరులు ఉన్నది తెలంగాణలో... నదులు పారేది తెలంగాణలో... కానీ మడులు పారేది మాత్రం ఆంధ్రలో-- ఈటెల రాజేందర్ (తెరాస నాయకుడు)[8]
- కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం తెలంగాణ రాదు-- కిషన్ రెడ్డి.[9]
- పన్నులు కట్టడంలో తెలంగాణ ప్రజలే నిజాయితీపరులు-- కె.చంద్రశేఖరరావు[10]
- స్వర్గమిచ్చినా వద్దు, తెలంగాణే కావాలి-- కోదండరాం.
- మోనాలిసాకు తెలంగాణకు తేడా లేదు-- పితాని సత్యనారాయణ.
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 30-07-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 11-05-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 16-12-2008
- ↑ నమస్తే తెలంగాణ దినపత్రిక 08-08-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 05-02-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 18-05-2012
- ↑ సాక్షి 21-05-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 09-07-2012
- ↑ ఈనాడు దినపత్రిక 15-07-2012
- ↑ ఈనాడు దినపత్రిక 07-08-2012