నారా చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
చంద్రబాబునాయుడు యొక్క ముఖ్య కొటేషన్లు
మార్చు- రావణాసురుడు, నరకాసురుడు, బకాసురుడు, మారీచుడు పురాణాల్లో ఉండేవారు. ఇప్పుడు వారంతా రాష్ట్రంలో పుట్టారు.[1]
- ప్రజలకు పప్పుబెల్లాలు పంచి కొడుకుకి కోట్ల రూపాయలు దోచిపెట్టిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.[2]
- కొండనైనా పిండి చేయగల సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది [3]
- నేను నడిచేది పూలబాట కాదు, ముండ్లబాట (పాదయాత్రపై బాబు వ్యాఖ్య)[4]
- తొమ్మిదేళ్ళ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు [5]
- చెప్పులు కుట్టే చేతులు చరిత్ర సృష్టించాలి (మాదిగల అభివృద్ధి గురించి వ్యాఖ్య)[6]
- గిరిజన కుటుంబాలకు పెద్ద కొడుకులా పనిచేసి చంద్రబాబు నాయక్ అనిపించుకుంటాను[7]
- అవినీతిపరుల పట్ల నేను హిట్లర్ కంటే కఠినంగా ఉంటాను[8]
- నిజాం హైదరాబాదు నిర్మిస్తే నేను సైబరాబాదు నిర్మించా[9]
- దున్నపోతుకు గడ్డేశారు, పాలెలా ఇస్తుంది. [10]
చంద్రబాబునాయుడుపై ఉన్న ముఖ్య కొటేషన్లు
మార్చు- తెలంగాణ విషయంలో రెండుకళ్ళ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న చంద్రబాబుకు 2014 ఎన్నికల తర్వాత గుడ్డికన్నే మిగులుతుంది -- జి.కిషన్ రెడ్డి (భాజపా రాష్ట్ర అధ్యక్షుడు)[11]
- చంద్రబాబు ఓ చచ్చిన పాము, దాన్ని మళ్ళీ మళ్ళీ చంపలేము -- నారాయణ (సీపీఐ కార్యదర్శి)[12]
- చంద్రబాబు నాయుడు బుర్ర ట్యూబ్ లైట్ వంటిది-- గొడ్డు వెలగల ఉదయ్ కిరణ్
- చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతంతో స్టాండ్ ఉన్న సైకిల్‌ను తొక్కుతున్నారు-- హరీశ్ రావు (తెరాస నాయకుడు)[13]
- 1999లో లాగులు కూడా వేసుకోని నేతలు ఇప్పుడు చంద్రబాబు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు-- కడియం శ్రీహరి[14]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ ఈనాడు దినపత్రిక, తేది 29-04-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 28-04-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 30-03-2012
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 15-10-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 03-10-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 27-10-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 01-12-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 01-12-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 13-11-2012
- ↑ (కాంగ్రెస్ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శ)ఈనాడు దినపత్రిక తేది 07-04-2013
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 05-02-2012
- ↑ సాక్షి దినపత్రిక, తేది 21-02-2012
- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక 11-07-2012
- ↑ ఈనాడు దినపత్రిక తేది 18-11-2012