పాలమూరు కూలీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
== పాలమూరి కూలీపై వ్యాఖ్యలు ==
* తమ రెక్కలు డొక్కలు క్రుంగిపోవగా దేబెలుగాక యుండి, తమ దేశముకై తనువొంచు పాలమూరు లేబరు మించు వారలిల లేరు.-----[[గంగాపురం హనుమచ్ఛర్మ]]<ref>మహబూబ్ నగర జిల్లా సర్వస్వం, (పాలమూరు మహా మండల ప్రశస్తి-గంగాపురం హనుమచ్ఛర్మ), సంపాదకులు:బి.ఎన్. శాస్త్రి, మూసి పబ్లికేషన్స్, హైదరాబాడ్,1993, పుట -1</ref>.
* కూడు గుడ్డ లేక వలసపోవు అమాయక జీవులు/కపటమెరుగని కర్మజీవులు----[[డా.బూర్గుల కేశవులు]]<ref> పాలమూరు కవిత,(పాలమూరు కూలీలం-డా.బి.కేశవులు), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-50</ref>.
* హైటెక్ సిటీ నిర్మాణానికి/ ఎన్ని పగళ్ళు ఎండలో కాలావో! ఎన్ని రాత్రుళ్ళు చలిలో ముడుచుకపోయావో!---పల్లాటి శ్రీకాంత్.<ref> పాలమూరు కవిత,(కూలన్న-పల్లాటి శ్రీకాంత్), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-66</ref>.
*<poem>
పని ఎక్కడ సాగుతుంటే
మేమక్కడ కనిపిస్తాం
నెత్తిమీద గంపతోటి
చేతిలోన పలుగు పట్టి
మా రక్తం పంచుకుంటూ
పదిమందికి తోడ్పతుతాం
పాలమూరు కూలీలం
మేం పాలమూరు కూలీలం
 
మా చెమటల తడులు లేని
ప్రాజెక్టులు యిలను లేవు
ఏ దేశం ఏ రాజ్యం
ఏ ప్రాంతం చూసినా మేమక్కడ ఉంటాం
పాలమూరు కూలీలం
మేం పాలమూరు కూలీలం</poem>----మాదిరాజు హరినందన్‌రావు.<ref> పాలమూరు కవిత,(ఎండిన డొక్కల సాక్షిగా-మాదిరాజు హ.నం.రావు), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-89</ref>.
 
*<poem>
కట్టలూ, ఆనకట్టలూ కట్టే
కూలీ మనుషులు
ఇతరుల పచ్చదనం కోసం
తమ రక్తాన్ని స్వేదీకరించే
చెమట మనుషులు
 
ఎక్కడికైనా వెళ్ళి
పనిచేసే కలేజా ఉన్న
పాలమూరు లేబరుగా
బతుకులీడుస్తున్న
వలస పక్షులు</poem>---ఎం.పి.రమేశ్ బాబు<ref> పాలమూరు కవిత,(వలసపక్షులు-ఎం.పి.రమేశ్ బాబు), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-112</ref>.
*<poem>పాలమూరు లేబరు
ఉపన్యాసాలకు లేబిలు
 
ఎన్ని మారినా మారనిదొకటే
అది పాలమూరు లేబరు బతుకు</poem>----డా.ఎం.రాములు.<ref> పాలమూరు కవిత,(పాలమూరు లేబరు బతుకులు-డా.ఎం.రాములు), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-113</ref>.
* <poem>
శ్రమైక జీవులం
కార్మికులం,కర్షకులం
కూడు కోసం, గూడు కోసం
దేశదిమ్మరులం
పాలమూరు కూలీలం</poem>----డా.టి.మోహన్ సింగ్<ref> పాలమూరు కవిత,(శ్రమైక జీవులం-డా.టి.మోహన్ సింగ్), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-154</ref>.
 
== ఇవీ చూడండి ==
*[[మహబూబ్ నగర్|మహబూబ్ నగర్‌పై వ్యాఖ్యలు]]
"https://te.wikiquote.org/wiki/పాలమూరు_కూలీ" నుండి వెలికితీశారు