మార్క్ ట్వెయిన్

అమెరికన్ రచయిత

మార్క్ ట్వెయిన్ (Mark Twain) అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత. ఇతడు 1835, నవంబర్ 30న జన్మించాడు. ఏప్రిల్ 21, 1910న మరణించాడు.

Mark Twain


మార్క్ ట్వెయిన్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు:

మార్చు
  • చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం.
  • ఒకవేళ ప్రపంచంలోని మూర్ఖులందరూ చనిపోతే నేను ఒంటరిగా ఎలా జీవించాలో!
  • పాలకులు నిరంకుశులుగా తయారైతే ప్రజలు అలాంటి వారిని చెత్తబుట్టలో విసిరిపారేస్తారు.
  • నేను ఒక నియమం పెట్టుకున్నాను. నిద్రపోయేటప్పుడు పొగతాగకూడదని.
  • మనుషులందరూ ఒకేలా ఆలోచిస్తే ఏమీ బాగుండేది కాదు. ఆ అభిప్రాయభేదాలవల్లే కదా గుర్రప్పందాలు జరుగుతున్నాయి.
  • ఏప్రిల్ ఫూల్స్ డే... మిగిలిన సంవత్సరమంతా మనం ఎలా ప్రవర్తిస్తామో తెలియజేసే రోజు.
  • మన మతం అనుభవం మీద ఏర్పడిన మతం.
  • ఆకలితో ఉన్న కుక్కను చేరదిస్తే అది కరవనుగాక కరువదు. మనిషికి కుక్కకు ఉన్న తేడా అదే.
  • జననమంటే ఆనందం. మృత్యువంటే ఏడుపు ఎందుకు?
  • నిజం తన బూట్లు వేసుకొనేలోపు అబద్ధం ప్రపంచంలో సగం చుట్టివస్తుంది.
  • ఒకే రకంగా ఆలోచించాలనడం మంచిది కాదు.అభిప్రాయ భేధాలే గుర్రపు పందాలు.
  • మరొకరి బాధ నుండి తను జన్మిస్తాడు.తన బాధతో తను మరణిస్తాడు. ఆలోచనలూ అంతే.
  • మంచిగా ఉండడం గౌరవం.ఇతరులకు మంచిగా వుండమని శిక్షణ నివ్వడం మరింత గౌరవం.అంతే కాకుండా తక్కువ కష్టం.
  • ఏకాంతంగా ఉన్నప్పుడు ఏ మనిషికి తన మీద తనకే గౌరవం ఉండదు.
  • అమెరికాను కనుక్కోవడం ఆశ్చర్యం, కనుక్కోకుండా ఉండటం మరింత ఆశ్చర్యం.
  • మనిషి తన అంతరంగాన్ని ఆలోచిస్తే గౌరవం కనిపించదు.
  • రెండు భావాల అనుకోని బంధం చమత్కారం.
  • మనం ఎనభై ఏళ్ల వయసులో పుట్టి పద్దెనిమిది ఏళ్ల వయసుకి ఎదిగితే అదే అంతులేని ఆనందం.
  • దుర్మార్గులతో ఎవ్వరూ పోటీపడకూడదు.వారి పట్ల కృతజ్ఞతతో ఉండడమే మేలు.
  • దేవుని వలన మనకి మూడు వరాలు లభించాయి. వాక్ స్వాతంత్ర్యం,భావ స్వేఛ్ఛ. ఆ రెండింటిని ఆచరించని వివేకం మూడవది.
  • ధర్మకర్తల వ్యవస్థ తెలివి మీద నిజాయితీ మీద ఆంక్షలు విధిస్తుంది. అంతే కాదు మూర్ఖత్వం అవివేకాన్ని రక్షిస్తుంది.
  • మొదట దేవుడు మూర్ఖులను తర్వాత పాఠశాల కమిటీలను సృష్టించాడు.
  • ఆటలు,పని ఒకటే పరిస్థితులు,పేర్లలో తేడానే కారణం.
  • రాచమర్యాదలు ముందు, నీతి తర్వాత.
  • ఇతరుల దారులంటే మనకు వయసు పెరగదు.
  • మూర్ఖులకు కృతజ్ఞతలు.వాళ్లే లేకపోతే మనం గెలుపు వైపు నిలబడలేము.
  • మనం పిచ్చివాళ్లని గుర్తుంచుకుంటే కొన్ని రహస్యాలు మాయమవుతాయి. జీవితం అర్దమవుతుంది.
  • మంచి పుస్తకం చదవని వాడు ఏ పుస్తకం చదవని వాడు ఒకటే.
  • ఒకేసారి రెండు సిగరెట్లు కాల్చకూడదని నేనొక నియం పెట్టుకున్నాను.
  • జీవితంలో కష్టలెన్నో...ప్రేరేపణలు..తుఫానుదారులు....
  • బైబిల్ లో అర్ధం కాని భాగాల కంటే అర్ధమైన భాగాలే నన్ను ఇబ్బంది పెట్టాయి.
  • భ్రాంతి నుండి విడివడకు, బ్రాంతి విడిపోతే నువ్వు బ్రతకవచ్చు కాని జీవితానికి దూరం కాలేవు.
  • సరైన పదానికి,దాదాపు సరైన పదానికి కాంతికి,కాంతివంతమైన నల్లికి వున్నంత తేడా వుంది.
  • ఆత్మ సజీవం అనుకోవడానికి ఖరణం వేల సంవత్సరాల నమ్మిక, అలాగే భూమి అల్లపరుపుగా వుందనుకోవడం కూడా.
  • నేను చనిపోయానని చెప్పడం అతిశయోక్తి.
  • ఆదాముకు మనం ఋణపడి వున్నాము. అతను మరణాన్ని కనుగొని మానవజాతికి గొప్ప మేలు చేశాడు.
  • స్వర్గ నరకాలను గురించి నేనెమీ చెప్పను. రెందు చోట్ల నాకు మిత్రులున్నారు.
  • ఈ జీవితంలో విజయం తప్పని సరి కావడానికి కావలసింది అవివేకం మన మీద మనకు నమ్మకం.
  • దుస్తులు పుట్టగానే వినయం మరణించింది.
  • అంతా శిక్షణలోనే నేటి దివ్య ఫలం పూర్వం వగరైన బాదం పండు. ఉన్నతవిద్యతో కాలీఫ్లవర్ క్యాబేజి అయ్యింది.
  • చేతులు మారిన పాత వజ్రాలు వుండటం అసలేమీ లేకుండా వుండటం కంటే మంచిది.
  • మనకు లభించిన వాటిలో సత్యం అత్యంత విలువైనది.దాన్ని మనం మతంగా ఉపయోగించుకో.
  • సత్యం శక్తివంతం అది నశించదు.
  • సంతోషం కాదు విచారమే హాస్యానికి మూలాధారం.
  • మనం ఆనందంగా ఉండడానికి మంచి మార్గం.ఇతరులను ఆనందంగా ఉంచడమే
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.