మేరీ క్యూరీ

ఫ్రెంచి, పోలిష్ ఫిజిసిస్టు, కెమిస్టు
(మేడం క్యూరీ నుండి మళ్ళించబడింది)

మేరీ క్యూరీ (Marie Curie) ప్రముఖ శాస్త్రవేత్త. ఈమె నవంబర్ 7, 1867న పోలెండులోని వార్సాలో జన్మించింది. రెండు నోబెల్ బహుమతులను పొందిన తొలి మహిళగా ప్రసిద్ధి చెందినది. 1903లో భౌతికశాత్రంలో, 1911లో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతులను పొందినది. జూలై 4, 1934 న మేరీ క్యూరీ ఫ్రాన్సులో మరణించింది.

మేరీ క్యూరీ

మేరీ క్యూరీ యొక్క ముఖ్య కొటేషన్లు

మార్చు
  • జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే.[1]
  • నువ్వు భయపడే దానిపై అవగాహన పెంచుకుంటే నీ భయం పోతుంది.
  • వ్యక్తుల గురించి తక్కువ ఆసక్తిని కలిగి ఉండండి, ఆలోచనల గురించి మరింత ఆసక్తిగా ఉండండి.
  • వ్యక్తులను మెరుగుపరచకుండా మెరుగైన ప్రపంచాన్ని నిర్మించాలని మీరు ఆశించలేరు.
  • మనపై పట్టుదల, అన్నింటికి మించి విశ్వాసం ఉండాలి.
  • అతని ప్రయోగశాలలో ఒక శాస్త్రవేత్త కేవలం సాంకేతిక నిపుణుడు కాదు: అతను అద్భుత కథల వలె తనను ఆకట్టుకునే సహజ దృగ్విషయాలను ఎదుర్కొనే పిల్లవాడు.
  • నా జీవితమంతా, ప్రకృతి కొత్త దృశ్యాలు నన్ను చిన్నపిల్లలా ఆనందపరిచాయి.
  • ప్రగతి మార్గం వేగవంతమైనది లేదా సులభం కాదని నాకు బోధపడింది.
  • వయసు పెరిగేకొద్దీ, వర్తమానాన్ని ఆస్వాదించాలి అని ఎక్కువ అనిపిస్తుంది; ఇది ఒక విలువైన బహుమతి, దయతో పోల్చవచ్చు

మూలాలు

మార్చు
  1. As quoted in Our Precarious Habitat (1973) by Melvin A. Benarde, p. v
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.