విజయశాంతి

సినీ నటి, రాజకీయ నాయకురాలు

విజయశాంతి ( జననం: 1966 జూన్ 24 ) తెలుగు సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు. ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె "ద లేడీ సూపర్ స్టార్", "లేడీ అమితాబ్"గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది.[1]

విజయశాంతి



వ్యాఖ్యలు

మార్చు
  • ఓటు వేసే ముందు మద్యం సేవించవద్దు. ఓటు వేసిన తర్వాత వీలైనంత తాగొచ్చు.
  • నా సమయం విలువైనదని నాకు నమ్మకం ఉంటే తప్ప నేను సినిమా చేయనవసరం లేదు.[2]
  • మా కుటుంబంలో తరతరాలుగా రామన్నగూడెంలో నివసిస్తున్నందున నాకు తెలంగాణతో అనుబంధం ఉంది.
  • చంపడం ఎల్లప్పుడూ తప్పు, ప్రభుత్వాలు కూడా దీనికి మినహాయింపు కాదు.
  • ప్రజలు ఎక్కడ అణచివేయబడ్డారో అక్కడ విప్లవం మొదలవుతుంది.
  • ఒక సెట్ నుంచి మరో సెట్ కు వెళ్లేదాన్ని. నేను ఉదయం 5 గంటలకు ప్రారంభిస్తాను కొన్నిసార్లు మరుసటి రోజు ఉదయం 5 గంటలకు మాత్రమే ముగించేదానిని. ఆ తర్వాత ఇంటికి వెళ్లి స్నానం చేసి మళ్లీ బయలుదేరేదాన్ని. అసలు నిద్ర ఉండదు.
  • సినిమాల నుంచి రాజకీయాల వరకు నేను ఏ పని చేసినా గమనించి, నేర్చుకుని, నా సర్వస్వం ఇచ్చేలా చూసుకుంటాను.
  • మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల కోసం నా చివరి శ్వాస వరకు పోరాడుతాను. వారి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు.


మూలాలు

మార్చు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=విజయశాంతి&oldid=19340" నుండి వెలికితీశారు