సి.నారాయణరెడ్డి
ప్రముఖ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత
(సి.నారాయణ రెడ్డి నుండి మళ్ళించబడింది)
సి.నారాయణరెడ్డి 1931, జూలై 29 న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామము హనుమాజీపేటలో జన్మించాడు. సి.నారాయణరెడ్డి తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988 ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.
సి.నారాయణ రెడ్డి యొక్క ముఖ్య కొటేషన్లు
మార్చు- అవయవాలు చస్తాయి కాని ఆలోచనలు చావవు. (మట్టి మనిషి ఆకాశం గ్రంథంలో)
- కుత్తుకులను నరికితే కాదు, గుండెలను కలిపితే గొంతు. (మట్టి మనిషి ఆకాశం గ్రంథంలో)
- ఏ భాష చెణుకైనా, ఏ యాస చినుకైనా తనలోన కలుపుకొని తరలింది తెలుగు.
- కప్పి చెప్పేవాడు కవి. విప్పి చెప్పేవాడు విమర్శకుడు.
- అంటరానివారెవరో కాదు, మా వెంటరానివారే.(సినారె?/మాధవపెద్ది బుచ్చి సుందర రామశాస్త్రి?)
- అదృష్టమనేది మత్తకోకిలలా ఉంటుంది. అది కాలమనే మావి గుబుళ్ళలో దాగి ఉంటుంది.
- అంత కడువెడు పాలపై ఒక్కింత మీగడ పేరినట్లు మనకు మిగులును గతంలోపలి మంచి, అదియే సంప్రదాయం.
- అందరిలాగే సామాన్యుణ్ణి. అయినా చిరంజీవుణ్ణి.
- గతమనెడు వజ్రంపు గోడల కట్టడంపై నిట్టనిలువునా శిరసునెత్తిన స్వర్ణమయ గోపురం సుమ్ము వర్తమానమ్ము.
- విధి నిదురబోతుంది. విధిలిఖితం నిదురబోదు.