భార్య

(ఆలి నుండి మళ్ళించబడింది)

పురుషుడిని వివాహం చేసుకున్న స్త్రీని భార్య అందురు. సతి, పత్ని, ఇల్లాలు అనే పదాలు దీనికి ప్రత్యమ్నాయాలు.

భార్యపై వ్యాఖ్యలు

మార్చు
  • మీ భార్య పుట్టిన రోజును జీవితాంతం గుర్తించుకోవాలంటే ఒక్కసారి మర్చిపోయి చూడండి చాలు. --జో బ్రాండ్
  • నా ఇద్దరు భార్యల వల్లా నాకు దురదృష్టమే ఎదురైంది. మొదటి భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, రెండో భార్య వదిలిపెట్టలేదు. --ప్యాట్రిక్ ముర్రే
  • నా భార్యతో మాట్లాడటానికి నావద్ద కొద్ది పదాలే ఉంటాయి కాని ఆమె వద్ద పేరాలకు పేరాలు ఉంటాయి. -- సిగ్మండ్ ఫ్రాయిడ్
  • ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి వేరె పోవువాడు వెర్రివాడు -- వేమన
  • కాలం గడుస్తున్న కొద్దీ భార్యలు ఆకర్షణ కోల్పోతారు-- ప్రకాష్ జైస్వాల్ (కేంద్ర మంత్రి)[1]

భార్యపై సామెతలు

మార్చు
  • అంగటి వీధిలో ఆలిని పడుకోబెట్టి వచ్చేవారు పొయ్యేవారు దాటిపోయినారు అన్నట్టు.
  • ఆలి చచ్చినవాడికి ఆడదే బంగారం
  • ఆలి పంచాయతీ రామాయణం పాలి పంచాయతీ భారతం.
  • ఆలి బెల్లమాయె, తల్లి అల్లమాయె.
  • ఆలి మాటవిన్నవాడు అడివిలో పడ్డవాడు ఒకటే.
  • ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట.
  • ఆలికి గంజిపోయనివాడు ఆచారం చెప్పినట్లు.
  • ఆలిని అదుపులో పెట్టలేనివాడు అందరినీ అదుపులో పెట్టగలడా?
  • ఆలిని ఒల్లని వాడు ఈలకూరలో ఉప్పులేదన్నాడట.
  • ఆలుమగల కలహం అన్నం తినేదాకనే.
  • ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం.
  • ఇంటికి దీపం ఇల్లాలు.
  • ఇంటిని చూసి ఇల్లాలిని అంచనావేయవచ్చు
  • ఇల్లాలులేని ఇల్లు దయ్యాలకొంప.
  • భార్య అనుకూలవతి ఐతే సుఖి లేకుంటే వేదాంతి ఔతారు.
  • భార్యమాట బ్రతుకుబాట.

భార్యపై సినిమా పాటలు

మార్చు
  • ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి. (దేవత) - వీటూరి

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక తేది 03-10-2012
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=భార్య&oldid=12524" నుండి వెలికితీశారు