వేమన
సుప్రసిద్ధ తెలుగు కవి
వేమన 1650-1750 మధ్య కాలములో జీవించి తెలుగు కవి. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పాడు.
వేమన పద్యాలలో అంతర్లీనంగా ఉన్న వ్యాఖ్యలు
మార్చు- అనఁగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
- అనువుగానిచోట అధికులమనరాదు.
- అన్ని దానములను నన్నదానమె గొప్ప; కన్నవారికంటె ఘనులు లేరు
- అప్పులేనివాడె యధిక సంపన్నుడు.
- అల్పబుద్ధివాని కధికార మిచ్చిన; దొడ్డవారినెల్లఁ దొలఁగఁ గొట్టు
- అల్పుఁ డెపుడు బల్కు నాడంబరము గాను; సజ్జనుండు బలుకుఁ జల్లగాను.
- ఆఁడుదాని బొంకు గోడపెట్టినయట్టు; పురుషవరుని బొంకు పూలతడిక.
- ఆత్మశుద్ధి లేని యాచారమది యేల.
- ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి వేరె పోవువాడు వెర్రివాడు
- ఆలివంకవార లాత్మబంధువు లైరి; తల్లివంకవారు తగినపాటి; తండ్రివంకవారు దాయాది తగవులౌ.
- ఆశ కన్న దుఃఖ మతిశయంబుగ లేదు; చూపు నిలుపకున్న సుఖము లేదు; మనసు నిల్పకున్న మఱి ముక్తి లేదయా.
- ఇనుము విఱిగె నేని యినుమాఱు ముమ్మాఱు; కాచియతుక నేర్చు కమ్మరీడు; మనసు విఱిగెనేని మఱియంట నేర్చునా?
- ఇంటియాలు విడిచి యిల జారకాంతల వెంటఁ దిరుగువాఁడు వెఱ్ఱివాఁడు.
- ఇంటిలోని పోరు నింతింత గాదయా.
- ఎలుకతోలు తెచ్చి ఏడాది ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు.
- కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
- కోపమున ఘనత కొంచెమైపోవును.
- గంగి గోవుపాలు గరిటడైనను చాలు, కడవెడైనను నేమి ఖరము పాలు.
- చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా.
- చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా.
- తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు.
- తల్లితండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి? వాడు గిట్టనేమి?
- తినగ తినగ వేము తియ్యనుండు
- నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకుబెళుకు రాళ్ళు తట్టెడేల
- పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు.
- పురుషులందు పుణ్య పురుషులు వేరయ.
- భాండశుద్ధి లేని పాకమది యేల.
- సాధనమున పనులు సమకూరు ధరలోన