మానవ జీవితంలో అతి ముఖ్యఘట్టాల్లో పెళ్ళి ఒకటి.

ఆత్రుత కొద్ది ఆడవాళ్ళు, అలసిపోయి మగవాళ్ళు చేసుకొనేదే పెళ్ళి---ఆస్కార్ వైల్డ్

పెళ్ళికి సంబంధించిన వ్యాఖ్యలు

మార్చు
  • పెళ్ళికి ముహుర్తమా !!! ముహుర్తము లేని పెళ్ళి ఇందూ సాంప్రదాయమగును :- శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
  • మూడే ముళ్ళు, ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు: - ఆచార్య ఆత్రేయ
  • మగవాడు పెళ్ళి చేసుకుంటే మనం ఓ స్నేహితుడిని కోల్పోయినట్లే -- హ్యూరిక్ ఇచ్సెన్
  • పెళ్ళిళ్ళలో చూపించే ఒక్క జాతకమూ నిజం కాదు -- గురజాడ అప్పారావు
  • పెళ్ళంటే... చేపను పట్టుకోవడం కోసం పాముల పుట్టలో చేయి పెట్టడం లాంటిది -- లియోనార్డో డావిన్సీ
  • పెళ్ళి చేసుకోవడం సులభం, కాపురం చేయడమే కష్టం-- రాబర్ట్ ఫ్లాక్.

పెళ్ళికి సంబంధించిన సామెతలు

మార్చు
  • అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు
  • ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి
  • ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్లు.
  • గుండ్రాయి దాచేస్తే పెళ్లాగిపోతుందా?
  • పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు
  • పూరణం లేని బూరె, వీరణం లేని పెళ్ళి.
  • పెళ్ళంటే నూరేళ్ళ పంట
  • పెళ్ళకొ తంటా, భుజాల మంట.
  • పెళ్ళికి రావయ్యా అంటే, విందుకు వీలు చేసుకుంటానన్నాడట
  • పెళ్ళికి వెళ్తుంటే పిల్లి అడ్డమొచ్చినట్లు.
  • పెళ్ళినాటి విందు ప్రతిరోజు పసందుగా ఉండదు.
  • చచ్చినవాడి పెళ్ళికి వచ్చిందే కట్నం.
  • కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు
  • దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే.
  • దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన.
  • పెళ్ళికి పందిరి వెయ్యమంటే చావుకి పాడి కట్టినట్టు
  • ఆడపిల్ల పెళ్ళి, అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు...
  • వెయ్యి అబద్దాలాడి అయినా ఒక పెళ్ళి చెయ్యమన్నారు.
  • దేవుడి పెళ్ళికి అందరూపెద్దలే.
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=పెళ్ళి&oldid=15737" నుండి వెలికితీశారు