రాజమండ్రి
రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద నగరం. ఇది గోదావరి నది తీరాన ఉంది. ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రము.రాజమండ్రి నగరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాజమండ్రి అర్థిక, సాంఘిక, చారిత్రక మరియు రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం.రాజమండ్రి నగరం ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగవ అతి పెద్ద నగరము. రాజమండ్రి పూర్వపు పేరు రాజమహేంద్రి. గోదావరి నది పాపి కొండలు దాటిన తరువాత ఇక్కడికి విస్తరించి మైదానంలో ప్రవేశించి కొద్ది మైళ్ళు దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర చీలి డెల్టాగా మారుతుంది. ఈ పుణ్య క్షేత్రంలో పన్నెండేళ్ళకొకసారి పవిత్రగోదావరి నది పుష్కరాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇది రాజరాజనరేంద్రుడు పరిపాలించిన చారిత్రక స్థలం. అభివృద్ధిలో రాష్ట్రంలోని నగరాలలో ఇది 5వ స్థానంలో ఉంది. పూర్వం రాజమహేంద్రవరం, రాజమహేంద్రిగా ఉన్న ఈ నగరం పేరు బ్రిటిషుపాలనలో రాజమండ్రిగా రూపాంతరం చెందింది.
రాజమండ్రిపై వ్యాఖ్యలు
మార్చు- కొంటె పిల్లకాయలు లేని కన్నతండ్రి-గోదావరి పొంగులేని రాజమండ్రి.--ఆరుద్ర
హంసీయానకు గామికి న్నధమ రోమాళుల్ నభఃపుష్పముల్
సంసారద్రుమ మూల పల్లవ గుళుచ్ఛంబైన యచ్చోట వి
ద్వాంసుల్ రాజమహేంద్ర పట్టణమునన్ ధర్మాసనంబుండి ప్ర
ధ్వంసాభావము ప్రాగభావ మనుచున్ దర్కింత్రు రాత్రైకమున్
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994.