గోదావరి

దక్షిణ భారత దేశంలో ప్రవహించే నది

గోదావరి నది భారత దేశం లో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజమబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణ లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతము లో సంగమిస్తుంది. ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రములు మరియు పట్టణములు కలవు. భద్రాచలము, రాజమండ్రి వంటివి మచ్చుకు కొన్ని. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి(గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ మరియు కశ్యప. ఇందులో, గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినిలు. ఆ పాయలు సప్తరుషుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.

రాజమండ్రి రైల్వేస్టేషన్ భవనంపై గోదావరి మాత విగ్రహం

 గోదావరి తన పురా ని
గూఢ గాథలను స్మరించి
తనలో తా నవ్వుకొనుచు
నను గని లజ్జితయయ్యెను

---సినారె[1]

]]

గోదావరిపై వ్యాఖ్యలు

మార్చు

"ఉప్పొంగి పోయింది గోదావరీ తాను
తెప్పున్న ఎగిసింది గోదావరీ
కొండల్లు ఉరికింది కోనల్లు నిండింది
ఆకాశగంగతో హస్తాలు కలిపింది...."

శంఖాలు పూరించి కిన్నెరలు మీటించి
శంకరాభరణ రాగాలాప కంఠమై...
నరమానవుని పనులు సిరిమొగ్గి వణకాయి
కరమెత్తి దీవించి కడలికే నడిచింది...

--అడవి బాపిరాజు

సినిమా పాటల్లో గోదావరి

మార్చు
  • గోదారీ గట్టుంది, గట్టుమీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, ఆ పిట్ట మనసులో ఏముంది.
-ఆత్రేయ (మూగమనసులు చిత్రం నుండి)
  • వయారీ గోదారమ్మా ఒళ్లంతా ఎందుకమ్మ కలవరం
  • గలగల పారుతున్న గోదారిలా...(పోకిరిసినిమా)
  • వేదంలా ఘోషించే గోదావరీ...
  • వెల్లువొచ్చె గోదారమ్మా! వెల్లాకిల్లా పడ్డానమ్మా! ఓలమ్మో!ఓరమ్మో!
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు

తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994.

  1. సినారె:దివ్వెల మువ్వలు(సంస్కారధార),కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1962,పుట-20
"https://te.wikiquote.org/w/index.php?title=గోదావరి&oldid=13533" నుండి వెలికితీశారు