శ్రీనాథుడు
'
శ్రీనాథుడు 15వ శతాబ్దమున జీవించిన తెలుగుకవి. వీరు కొండవీటి ప్రభువు సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థాన కవి. విద్యాధికారి. డిండిమభట్టు అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించినాడు. ఈతనికి కవిసార్వభౌముడను బిరుదము కలదు. భీమ ఖండము, కాశీ ఖండము, మరుత్తరాట్చరిత్ర, శృంగార నైషధము మొదలగు గొప్ప రచనలు చేశాడు. ఈయన వ్రాసిన చాటువులు ఆంధ్రదేశమంటా బహు ప్రశస్తి పొందినాయి.
వ్యాఖ్యలు
మార్చువిజయనగర సామ్రాజ్యం గురుంచి
మార్చు- తల్లీ! కన్నడ రాజ్య లక్ష్మి! దయలేదా? నేను శ్రీనాథుడన్ .
తిరిపెమునకిద్దరాండ్రా/పరమేశాగంగవిడువు పార్వతిచాలున్
కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము
వసుధేశుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్
హంసీయానకు గామికి న్నధమ రోమాళుల్ నభఃపుష్పముల్
సంసారద్రుమ మూల పల్లవ గుళుచ్ఛంబైన యచ్చోట వి
ద్వాంసుల్ రాజమహేంద్ర పట్టణమునన్ ధర్మాసనంబుండి ప్ర
ధ్వంసాభావము ప్రాగభావ మనుచున్ దర్కింత్రు రాత్రైకమున్
అంగడి యూర లేదు వరి యన్నము లేదు శుచిత్వ మేమి లే
దంగన లింపు లేరు ప్రియమైన వనంబులు లేవు నీటికై
భంగపడంగ బాల్పడు కృపాపరు లెవ్వరు లేరు దాత లె
న్నంగను సున్న గాన బలనాటికి మాటికి బోవ నేటికిన్
జొన్నకలి జొన్నయంబలి జొన్నన్నము జొన్న పిసరు జొన్నలె తప్పన్
సన్నన్నము సున్నసుమీ పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరకున్
1.
వీరులు, దివ్య లింగములు, విష్ణువు, వెన్నుడు, కళ్ళిపోతరా
జారయ గాల భైరవుడు, నంకమ శక్తియు, యన్నపూర్ణ
గేరెడు గంగధార మడుగే మణికర్ణిక గా జెలంగు నీ
కారెమపూడి పట్టణము కాశిగదా పలనాటి వారికిన్
2.శ్రీశైల భూమిలో శ్రేష్టమైనట్టి
కార్యమ పురి భూమి ఘన పుణ్యరాశి [2]
పోరు మంచిది కాదు భూమి నెక్కడను
పాడౌను దేశంబు పగమించె నేని
శ్రీనాథునిపై వ్యాఖ్యలు
మార్చు- “ఋషి వంటి నన్నయ్య, రెండవ వాల్మీకి”.--విశ్వనాథ సత్యనారాయణ
మూలాలు
మార్చు- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన శ్రీనాథ మహాకవి శృంగార నైషధం