ఈ రోజు వ్యాఖ్యలు అక్టోబరు 2013
అక్టోబరు 2013 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- అక్టోబరు 2, 2013:ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి. -- మహాత్మా గాంధీ
- అక్టోబరు 3, 2013:అంటరానివారెవరో కాదు, మా వెంటరానివారే. -- సి.నారాయణరెడ్డి
- అక్టోబరు 6, 2013:ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక -- కాళోజీ నారాయణరావు
- అక్టోబరు 7, 2013:పెళ్ళి చేసుకోవడం సులభం, కాపురం చేయడమే కష్టం-- రాబర్ట్ ఫ్లాక్.
- అక్టోబరు 8, 2013:అన్నా హజారే గాంధేయవాదే కాని గాంధీ కాదు -- అరుందతీ రాయ్.
- అక్టోబరు 9, 2013:నా తెలంగాణ కోటి రతనాల వీణ -- దాశరథి కృష్ణమాచార్య
- అక్టోబరు 10, 2013:ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలను ఉతికి పారేయడమే ప్రజాస్వామ్యం-- ఆస్కార్ వైల్డ్.
- అక్టోబరు 28, 2013:ఆలోచనా పరుడికి మరణం ఉండవచ్చు కాని ఆలోచన వేలమందికి స్పూర్తినిస్తుంది -- సుభాష్ చంద్ర బోస్
- అక్టోబరు 29, 2013:మాతృభూమికి సేవ చెయ్యని యవ్వనం వృధా -- చంద్రశేఖర్ ఆజాద్
- అక్టోబరు 30, 2013:సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. -- స్వామీ వివేకానంద
- అక్టోబరు 31, 2013:మంటలచేత మాట్లాడించి, రక్తం చేత రాహాలాపన చేయిస్తాను -- శ్రీశ్రీ