ఎం.ఎస్.సుబ్బులక్ష్మి

భారతీయ గాయిని

ఎం.ఎస్.సుబ్బులక్ష్మి సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు. కర్ణాటక సంగీతంలో డి.కె.పట్టమ్మాళ్, ఎం.ఎల్.వసంతకుమారిలతో కలిసి మహిళా సంగీత త్రయంగా పేరొందినవారు. ఆమె సంగీత వైదుష్యానికి భారత రత్న పురస్కారం సహా ఎన్నో గౌరవాలు, పురస్కారాలు, బిరుదులు లభించాయి.

M.S.Subbalakshmi called the Nightingale of India (1944)

వ్యాఖ్యలు

మార్చు
  • ప్రశాంతమైన రాత్రి వేళల్లో రేడియోలో నుంచి వెలువడే అబ్దుల్ కరీంఖాన్, బడే గులాం అలీఖాన్ వంటి హిందూస్థానీ సంగీత విద్వాంసుల సంగీతం ఆలకిస్తూ ముగ్ధురాలయేదాన్ని(మేడ మెట్ల మీద కూర్చిన పక్కింటివారి రేడియో వింటూండే నాటి రోజుల గురించి)
  • ఈనాడు నేనీ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నా భర్తే. ఆయనకు నేనెంత రుణపడి వున్నానో నాకే తెలియదు. అందుకే నాకు లభించిన పురస్కారాలు, గౌరవాలు అన్నీ ఆయన పాదపద్మాలకే సమర్పిస్తున్నాను. ఆయన నాకు భౌతికంగా దూరమైనా నాకు భారతరత్న పురస్కారం లభించడం తనకూ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.
  • భారతీయ సంగీతం మొత్తంగా అతిలోకమైన, దివ్య సంభాషణ వైపుకే ముగిసేందుకు మొగ్గుచూపుతుంది. నేను ఈ క్రమంలో ఏదైనా చేయగలిగానంటే కేవలం నన్ను నన్ను ఓ పరికరంగా ఎంచుకున్న పరమాత్ముని కృపాకటాక్షమే కారణం.
    • ఓడె టు ఎ నైటింగేల్ పుస్తకంలోని వ్యాఖ్య.మూస:Cite book
  • నాకున్న భయాల్లోకెల్లా పెద్దది-కచేరీలు, ప్రదర్శనలు చేయడం గురించే. నేను నా శ్రోతలకు బాధ్యురాలిగా భావిస్తాను, ఐతే వారంటే భయపడతాను కూడా.
  • భారతీయ సంగీతం కేవలం దైవిక కమ్యూనికేషన్ ముగింపు వైపు మాత్రమే కేంద్రీకృతమై ఉంది. నా వినయపూర్వకమైన ఆత్మను ఒక సాధనంగా ఎంచుకున్న సర్వశక్తిమంతుడి దయ వల్ల నేను ఈ విషయంలో ఏదైనా చేశానంటే.
  • ప్రదర్శనలు ఇవ్వడమంటే నాకు చాలా భయం. ప్రేక్షకుల పట్ల నేను బాధ్యతగా భావిస్తున్నాను, కానీ నేను వారికి భయపడుతున్నాను.

సుబ్బులక్ష్మిని గురించిన వ్యాఖ్యలు

మార్చు
  • నాదేముంది ఒక మామూలు ప్రధానమంత్రిని. ఆమె సంగీత సామ్రాజ్యానికే మహారాణి. –జవహర్ లాల్ నెహ్రూ, భారత తొలి ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు.[1]
  • నేను కాదు నైటింగేల్ ను, సుబ్బులక్ష్మే నైటింగేల్. –సరోజినీ నాయుడు, ప్రముఖ ఆంగ్ల కవయిత్రి, నైటింగేల్ ఆఫ్ ఇండియా బిరుదాంకితులు
  • వెనకటి కాలం అయినట్లయితే ఆ కళ్యాణి రాగానికి నా రాజ్యాన్నే యిచ్చుండేవాణ్ణి. కాని యిప్పుడా అవకాశం లేదు. నాకున్న దాంట్లో మీరేది అడిగినా యిస్తాను – ఉదయపూర్ మహారాజా.
  • సుబ్బులక్ష్మి సంగీత విద్వాంసులకు విద్వాంసురాలు. భజనలు గానం చేయడంలో ఆమెకు సాటి మరొకరు లేరు. –జ్యోతి బసు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సి.పి.ఐ(ఎం) నాయకుడు.
  • నా మానసిక గురువు, చిన్నప్పటి నుంచీ నా ఆరాధ్య దేవత ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి గారితో కలిసి పాడుతుంటే నాకు అనిర్వచనీయమైన ఆనందంతో ఆనందబాష్పాలు నా కళ్ళ నుంచి రాలాయి. –భానుమతి, ప్రముఖ సినీ నటి, గాయని, సంగీతదర్శకురాలు, దర్శకురాలు, నిర్మాత, రచయిత్రి.(ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మితో కలిసి తిరువాయూరు త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో పంచరత్నకీర్తన పాడిన సమయాన్ని గురించి)

మూలాలు

మార్చు
  1. రామమోహన్ రావు సత్తెనపల్లి, భారతరత్నంగా భాసించిన సంగీత తరంగం-ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జనవరి 25, 1998 పేజీలు.25-28.