ఈ రోజు వ్యాఖ్యలు డిసెంబరు 2012
డిసెంబరు 2012 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- డిసెంబరు 1, 2012:ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్ -- గురజాడ అప్పారావు
- డిసెంబరు 3, 2012:ఒక వ్యక్తి ఏ పొరపాటు చేయలేదంటే అతను ఏ ప్రయత్నమూ చేయనట్లే.--ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- డిసెంబరు 5, 2012:దీర్ఘకాలం వర్తమానానికి సరిపడదు. దీర్ఘకాలంలో అందరూ చనిపోయేవారే -- జాన్ మేనార్డ్ కీన్స్
- డిసెంబరు 6, 2012:నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు? నాయిచ్ఛయేగాక నాకేటి వెరపు? -- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- డిసెంబరు 7, 2012:నా భార్యతో మాట్లాడటానికి నావద్ద కొద్ది పదాలే ఉంటాయి కాని ఆమె వద్ద పేరాలకు పేరాలు ఉంటాయి. -- సిగ్మండ్ ఫ్రాయిడ్
- డిసెంబరు 8, 2012:నేను వేయబోతున్న ఒక చిన్న అడుగు, మానవాళి వేయబోతున్న పెద్ద ముందడుగు -- నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
- డిసెంబరు 9, 2012:పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు -- వేమన
- డిసెంబరు 10, 2012:పిరికివాళ్ళు చావడానికి ముందు అనేకసార్లు చస్తుంటారు -- విలియం షేక్స్పియర్
- డిసెంబరు 11, 2012:ప్రేమ బాధలను సహిస్తుంది కాని ఎన్నడూ ప్రతీకారాన్ని తలపెట్టదు. --మహాత్మా గాంధీ
- డిసెంబరు 12, 2012:మనవాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉందంటే... సైకిల్ స్టాండులో ఒక్ సైకిల్ నెట్టేస్టే మిగితావన్నీ పడిపోయేట్టు.-- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- డిసెంబరు 13, 2012:విలువైన ఆలోచనలు ఉన్న వారు జీవితంలో ఎన్నటికీ ఒంటరి వారు కారు -- రూసో
- డిసెంబరు 14, 2012:స్త్రీకి మాతృత్వం ఎంత అవసరమో, పురుషుడికి యుద్ధం అంతే అవసరం -- ముస్సోలినీ
- డిసెంబరు 15, 2012:అసమానతలపై పోరాటం చెయ్యి-- సర్దార్ పటేల్
- డిసెంబరు 16, 2012:సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. -- స్వామీ వివేకానంద
- డిసెంబరు 17, 2012:వ్యక్తికి బహువచనం శక్తి--శ్రీశ్రీ
- డిసెంబరు 18, 2012:ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అమెరికన్లు మహాసముద్రమైనా దాటివెళ్తారు కాని ఓటు వేయడానికి ప్రక్కవీధికి వెళ్ళరు. --బిల్ వాన్
- డిసెంబరు 19, 2012:ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం గాంధీ మార్గమే సరిపోదు. ఛత్రపతి శివాజీ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉంది -- అన్నా హజారే
- డిసెంబరు 20, 2012:మాట వినపడనివాడు చెవిటివాడు కాదు. మంచిమాట వినిపించుకోనివాడు నిజమైన చెవిటివాడు -- ఆది శంకరాచార్యుడు
- డిసెంబరు 23, 2012:ఉదయం కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ -- కాళోజీ నారాయణరావు
- డిసెంబరు 24, 2012:అప్పులేనివాడె యధిక సంపన్నుడు. --వేమన
- డిసెంబరు 25, 2012:ఒక పని చేయకూడదు అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించడమే అనవసరం. --అనీబీసెంట్