ఈ రోజు వ్యాఖ్యలు ఫిబ్రవరి 2011
ఫిబ్రవరి 2011 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- ఫిబ్రవరి 8, 2011: ---> ఉపాధ్యక్ష పదవి స్పేర్ టైర్ లాంటిది. -- ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్
- ఫిబ్రవరి 9, 2011: ---> ఒక వ్యక్తి ఏ పొరపాటు చేయలేదంటే అతను ఏ ప్రయత్నమూ చేయనట్లే.--ఆల్బర్ట్ ఐన్స్టీన్
- ఫిబ్రవరి 10, 2011: ---> నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు? నాయిచ్ఛయేగాక నాకేటి వెరపు? -- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- ఫిబ్రవరి 11, 2011: ---> పదండి ముందుకు, పదండి ముందుకు తోసుకుపోదాం పైపైకి. -- శ్రీశ్రీ
- ఫిబ్రవరి 12, 2011: ---> పిరికివాళ్ళు చావడానికి ముందు అనేకసార్లు చస్తుంటారు. -- విలియం షేక్స్‌పియర్
- ఫిబ్రవరి 13, 2011: ---> మానవుడు పుట్టుకతోనే సాంఘిక జంతువు. -- అరిస్టాటిల్
- ఫిబ్రవరి 14, 2011: ---> మీ భార్య పుట్టిన రోజును జీవితాంతం గుర్తించుకోవాలంటే ఒక్కసారి మర్చిపోయి చూడండి చాలు. -- జో బ్రాండ్.
- ఫిబ్రవరి 15, 2011: ---> వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్‌వేర్ లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- ఫిబ్రవరి 16, 2011: ---> సూర్యుడు, చంద్రుడు, సత్యం ఈ మూడింటిని దాచలేము.-- గౌతమ బుద్ధుడు
- ఫిబ్రవరి 17, 2011: ---> ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విధ్యార్థిగా ఉండు, అది నిన్ను మరింతగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. -- సర్వేపల్లి రాధాకృష్ణన్
- ఫిబ్రవరి 20, 2011: ---> కప్పి చెప్పేవాడు కవి. విప్పి చెప్పేవాడు విమర్శకుడు. -- సి.నారాయణరెడ్డి
- ఫిబ్రవరి 21, 2011: ---> కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు. -- విలియం షేక్స్‌పియర్
- ఫిబ్రవరి 23, 2011: ---> చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా. -- వేమన
- ఫిబ్రవరి 24, 2011: ---> తిండికలిగితే కండ కలదోయ్..కండ కలవాడేను మనిషోయ్.-- గురజాడ అప్పారావు
- ఫిబ్రవరి 25, 2011: ---> దీర్ఘకాలం వర్తమానానికి సరిపడదు. దీర్ఘకాలంలో అందరూ చనిపోయేవారే. -- జాన్ మేనార్డ్ కీన్స్
- ఫిబ్రవరి 26, 2011: ---> దేశ భాషలందు తెలుగు లెస్స -- శ్రీకృష్ణ దేవరాయలు
- ఫిబ్రవరి 27, 2011: ---> నా భార్యతో మాట్లాడటానికి నావద్ద కొద్ది పదాలే ఉంటాయి కాని ఆమె వద్ద పేరాలకు పేరాలు ఉంటాయి. -- సిగ్మండ్ ఫ్రాయిడ్