ఈ రోజు వ్యాఖ్యలు జనవరి 2009

జనవరి 2009 మాసములో మొదటి పేజీలో ప్రదర్శించబడిన "ఈ రోజు వ్యాఖ్య"లు.


  • జనవరి 2, 2009: కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు. --విలియం షేక్స్‌పియర్
  • జనవరి 3, 2009: శాసనాన్ని రూపొందించు అధికారము మరియు శాసనాన్ని అమలుచేయు అధికారము ఒకే చోట ఉంటే స్చేచ్ఛకు అవకాశమే ఉండదు. --మాంటెస్క్యూ


  • జనవరి 4, 2009: మార్పునుకు సిద్ధంగా ఉండండి. అపుడే కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు --మహాత్మా గాంధీ


  • జనవరి 5, 2009: ప్రతి సంవత్సరం సమావేశం పెట్టి కప్పల వలె బెకబెకలాడటం వల్ల ప్రయోజనం లేదు --బాలగంగాధర తిలక్



  • జనవరి 7, 2009: విద్య అనేది మనిషిలోని మంచిని వెలికితీయడానికి చేసే ప్రయత్నం --ప్లేటో



  • జనవరి 9, 2009: ప్రకృతి భోజనశాల వంటిది ఇందులో ఆహుతులకు మాత్రమే చోటు ఉంటుంది అనాహుతులై వచ్చేవారు ఆకలితో అలమటించి చావకతప్పదు --థామస్ మాల్థస్


  • జనవరి 10, 2009: ప్రజాస్వామ్యమంటే ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించబడే వ్యవస్థ --అబ్రహం లింకన్


  • జనవరి 11, 2009: మన వాళ్ళుత్త వెధవాయిలోయ్ --కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర (రచన గురజాడ అప్పారావు).
  • జనవరి 12, 2009: స్వరాజ్యమే నా జన్మహక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను--బాలగంగాధర తిలక్.
  • జనవరి 13, 2009: మహాత్మాగాంధీ లాంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు. --ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
  • జనవరి 14, 2009: వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు గొడుగు ఇచ్చి వర్షం రాగానే దాన్ని లాక్కునే మనస్తత్వం బ్యాంకరుకుంటుంది. --క్రౌథర్
  • జనవరి 15, 2009: రాజ్యమునకు ఆధారం ప్రజామోదమే కాని బలప్రయోగం కాదు. --థామస్ హిల్ గ్రీన్
  • జనవరి 16, 2009: రాజులు భూలోకంలో భగవంతుని ప్రతినిధులు. - జేమ్స్ 1
  • జనవరి 17, 2009: దేశభాషలందు తెలుగు లెస్స.--శ్రీకృష్ణదేవరాయలు
  • జనవరి 18, 2009: ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.--స్వామీ వివేకానంద
  • జనవరి 19, 2009: మన అభిప్రాయాలను ఇతరులపైన బలవంతంగా రుద్దడం వలన మనం నిజమైన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోలేము.--మహాత్మా గాంధీ
  • జనవరి 20, 2009: స్వరాజ్యం అంటే ఎవరో ఇచ్చేది కాదు అది పుచ్చుకొనేది.--సుభాష్ చంద్ర బోస్
  • జనవరి 21, 2009: స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు.--రూసో
  • జనవరి 22, 2009: వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్‌వేర్ లాంటిది.--నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • జనవరి 23, 2009: ఆహార ధాన్యాలు అంకశ్రేణిలో పెరిగితే, జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంది.--థామస్ మాల్థస్
  • జనవరి 24, 2009: తాంబూలలిచ్చేసాను, తన్నుకు చావండి.--కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు పాత్ర.
  • జనవరి 25, 2009: సప్లయి తనకు తగిన డిమాండును తానే సృష్టించుకుంటుంది.--జె.బి.సే
  • జనవరి 26, 2009: రాజులు భూలోకంలో భగవంతుని ప్రతినిధులు.--జేమ్స్ 1
  • జనవరి 27, 2009: ఆల్కహాల్ నా నుంచి తీసుకున్నదాని కంటే నేను దాన్నుంచి పొందిందే ఎక్కువ.--చర్చిల్




  • జనవరి 30, 2009: స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు.--రూసో