ఈ రోజు వ్యాఖ్యలు జూలై 2012
జూలై 2012 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- జూలై 1, 2010:భూమి మీద మనిషంత గొప్పవాడు ఎవాడూ లేడు, మనిషిలో మెదడంత గొప్ప అవయవం మరొకటి లేదు-- విలియం హామిల్టన్
- జూలై 2, 2010:అంటరానివారెవరో కాదు, మా వెంటరానివారే. -- సి.నారాయణరెడ్డి
- జూలై 3, 2010:ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్ -- గురజాడ అప్పారావు
- జూలై 4, 2010:ఎన్నికలలో డబ్బు, మద్యం పంచే వారు ఉగ్రవాదులకన్నా ప్రమాదకరులు. --జయప్రకాష్ నారాయణ (లోక్‌సత్తా)
- జూలై 5, 2010:గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్...-- నన్నయ
- జూలై 6, 2010:జై జవాన్ జై కిసాన్ -- లాల్ బహదూర్ శాస్త్రి
- జూలై 7, 2010:తూర్పు తూర్పే పడమర పడమరే, అవి ఎన్నటికీ కలవవు -- రుడ్యార్డ్ కిప్లింగ్
- జూలై 8, 2010:దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.--స్వామీ వివేకానంద
- జూలై 9, 2010:నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు? నాయిచ్ఛయేగాక నాకేటి వెరపు? -- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- జూలై 10, 2010:నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు. -- అబ్రహం లింకన్
- జూలై 11, 2010:ప్రపంచమే ఒక నాటకరంగం, ప్రజలందరూ అందులో పాత్రధారులే -- విలియం షేక్స్పియర్
- జూలై 12, 2010:మార్పునకు సిద్ధంగా ఉండండి. అపుడే కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు -- మహాత్మా గాంధీ
- జూలై 14, 2010:విలువైన ఆలోచనలు ఉన్న వారు జీవితంలో ఎన్నటికీ ఒంటరి వారు కారు -- రూసో
- జూలై 15, 2010:వ్యాధిని వైద్యుడు తగ్గిస్తాడు, ప్రకృతి మామూలుగానే నయం చేస్తుంది. -- అరిస్టాటిల్
- జూలై 16, 2010:నిలబడడానికి ఆధారం చూపించండి, భూమినే పైకెత్తుతా -- ఆర్కిమెడిస్
- జూలై 17, 2010:ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజలచేతిలోని ఆయుధాలు.--మహాత్మా గాంధీ
- జూలై 18, 2010:ఇతరుల సలహాపై ఆధారపడకు, నీ ఆలోచనలను నువ్వు అనుసరించు. -- విలియం షేక్స్పియర్
- జూలై 19, 2010:ప్రేమే నా మతం దాని కోసం ప్రాణత్యాగమైనా చేస్తాను -- జాన్ కీట్స్
- జూలై 20, 2010:హింస తోనే సృష్టి పూస్తది; హింస తోనే మార్పు వస్తది--శ్రీశ్రీ
- జూలై 21, 2010:పరిస్థితుల దృష్ట్యా నేను తీవ్రవాదిగా నటిస్తున్నా, నిజానికి నేను తీవ్రవాదిని కాను. -- భగత్ సింగ్
- జూలై 22, 2010:మనిషికి, మనిషికి మధ్య ఉన్న అసమానత్వమే బాధలన్నిటికీ కారణం-- అంబేద్కర్
- జూలై 23, 2010:ధనం వస్తుంది పోతుంది, జ్ఞానం వస్తుంది పెరుగుతుంది -- సత్యసాయిబాబా
- జూలై 24, 2010:ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి అమెరికన్లు మహాసముద్రమైనా దాటివెళ్తారు కాని ఓటు వేయడానికి ప్రక్కవీధికి వెళ్ళరు. --బిల్ వాన్
- జూలై 25, 2010:అప్పులేనివాడె యధిక సంపన్నుడు. --వేమన
- జూలై 26, 2010:ఒక వ్యక్తి ఏ పొరపాటు చేయలేదంటే అతను ఏ ప్రయత్నమూ చేయనట్లే.--ఆల్బర్ట్ ఐన్స్టీన్
- జూలై 27, 2010:అనువుగానిచోట అధికులమనరాదు. -- వేమన
- జూలై 28, 2010:అవయవాలు చస్తాయి కాని ఆలోచనలు చావవు. -- సి.నారాయణరెడ్డి
- జూలై 29, 2010:చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం. --మార్క్ ట్వెయిన్
- జూలై 30, 2010:తాంబూలలిచ్చేసాను, తన్నుకు చావండి. --కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు పాత్ర..
- జూలై 30, 2010:తాంబూలలిచ్చేసాను, తన్నుకు చావండి. --కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు పాత్ర..