ఈ రోజు వ్యాఖ్యలు మార్చి 2012

మార్చి 2012 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • మార్చి 1, 2012: ---> ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌, అది మోసిన బోయీ లెవ్వరు?-- శ్రీశ్రీ
  • మార్చి 2, 2012: ---> మీ భార్య పుట్టిన రోజును జీవితాంతం గుర్తించుకోవాలంటే ఒక్కసారి మర్చిపోయి చూడండి చాలు. --జో బ్రాండ్.
  • మార్చి 3, 2012: ---> సూర్యుడు, చంద్రుడు, సత్యం ఈ మూడింటిని దాచలేము --గౌతమ బుద్ధుడు
  • మార్చి 4, 2012: ---> వేయి పూలు పూయనీయండి -- మావో
  • మార్చి 5, 2012: ---> మాట వినపడనివాడు చెవిటివాడు కాదు. మంచిమాట వినిపించుకోనివాడు నిజమైన చెవిటివాడు -- ఆది శంకరాచార్యుడు
  • మార్చి 6, 2012: ---> కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా -- వేమన
  • మార్చి 7, 2012: ---> చిన్న పిల్లవాడికి నాప్కిన్స్ ఎన్ని సార్లు మార్చాల్సి ఉంటుందో థర్డ్ అంపైర్‌ను కూడా అన్ని సార్లు మార్చాలి -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • మార్చి 9, 2012: ---> కంటిని నమ్మాలి కాని చెవిని నమ్మకూడదు -- హెరడోటస్
  • మార్చి 10, 2012: ---> కొంతమంది యువకులు పుట్టుకతో వృధ్ధులు -- శ్రీశ్రీ
  • మార్చి 13, 2012: ---> ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం -- శ్రీశ్రీ
  • మార్చి 14, 2012: ---> ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం గాంధీ మార్గమే సరిపోదు. ఛత్రపతి శివాజీ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉంది -- అన్నా హజారే
  • మార్చి 16, 2012: ---> మనుషులను చంపగలరేమో కాని, వారి ఆదర్శాలను మాత్రం కాదు.--భగత్ సింగ్
  • మార్చి 18, 2012: ---> ఆలోచనా పరుడికి మరణం ఉండవచ్చు కాని ఆలోచన వేలమందికి స్పూర్తినిస్తుంది -- సుభాష్ చంద్ర బోస్
  • మార్చి 21, 2012: ---> భారతీయ మహిళలకు మరుగుదొడ్ల కంటె సెల్‌ఫోన్లే ముఖ్యం -- జైరాం రమేష్
  • మార్చి 22, 2012: ---> మరో జన్మంటూ ఉంటే అందమైన ఆడపిల్లగా పుట్టాలని ఉంది -- ఫరూక్ అబ్దుల్లా (జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి)
  • మార్చి 23, 2012: ---> ఏ తప్పూ చేయనివాడు రాజకీయ నాయకుడే కాదు. చేసిన తప్పులను అంగీకరించేవాడు రాజకీయ నాయకుడు కాలేడు.--జాన్ మేజర్
  • మార్చి 24, 2012: ---> ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. -- స్వామీ వివేకానంద
  • మార్చి 25, 2012: ---> జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే. -- మేరీ క్యూరీ
  • మార్చి 26, 2012: ---> తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు -- వేమన
  • మార్చి 28, 2012: ---> నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు -- ముస్సోలినీ
  • మార్చి 29, 2012: ---> నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు -- ఆరుద్ర
  • మార్చి 30, 2012: ---> నేను ఒక నియమం పెట్టుకున్నాను. నిద్రపోయేటప్పుడు పొగతాగకూడదని -- మార్క్ ట్వెయిన్


ఇవి కూడా చూడండి

మార్చు