సామెతలు - చ
సామెతలు |
---|
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ ఘ |
చ ఛ జ ఝ |
ట ఠ డ ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
"చ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
- చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెదికినట్టు
- చంకలో బిడ్డ నుంచుకుని, ఊరంతా వెతికినట్లు
- చక్కనమ్మ చిక్కినా అందమే
- చక్కని చెంబు, చారల చారల చెంబు, ముంచితే మునగని ముత్యాల చెంబు
- చచ్చిన వాడి పెళ్ళికి వచ్చినంత కట్నం
- చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం
- చదవేస్తే ఉన్న మతి పోయిందట
- చదవేస్తే ఉన్న మతి పోయినట్లు
- చదువు రాక ముందు కాకరకాయ... చదువు వచ్చాక కీకరకాయ
- చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు
- చదువుకోక ముందు కాకరకాయ, చదువుకున్న తరువాత కీకరకాయ
- చద్దన్నం తిన్నమ్మ మొగుడి ఆకలెరుగదు
- చనిపోయిన వారి కళ్ళు చారెడు
- చల్లకొచ్చి ముంత దాచినట్లు
- చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు
- చాప క్రింది నీరులా
- చారలపాపడికి దూదంటి కుచ్చు
- చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు
- చింత చచ్చినా పులుపు చావనట్టు
- చిత్తం చెప్పులమీద దృష్టేమో శివుడిమీద
- చిత్తశుద్ది లేని శివపూజలేల
- చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి
- చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు
- చెట్టు మీద పిట్టవాలె పిట్టవాలితే పట్టుకొంటే, పట్టుకొంటే గిచ్చుపెట్టే గిచ్చుపెడితే విడిచిపెడితి
- చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మడం
- చెడపకురా చెడేవు
- చెప్పేవాడికి వినేవాడు లోకువ
- చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు
- చెముడా అంటే మొగుడా అన్నట్టు
- చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు
- చెవిలో జోరీగ
- చేతకాక మంగళవారమన్నాడంట
- చేతకాక మద్దెలమీద పడిఏడ్చాడంట / చేతకాక మద్దెలమీద పడిఏడ్చాడంట|ఆడలేక మద్దెల ఓడన్నాడంట
- చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు
- చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి
- చేసేదేమో శివ పూజలు, దూరేదేమో దొమ్మర గృహాలు
- చెరువు గట్టుకు వెళ్ళి గట్టుమీద అలిగినట్టు...
- చెరువు మీద అలిగి....స్నానం చేయనట్లు
- చుట్టుగుడిసంత సుఖము, బోడిగుండంత భోగమూ లేదన్నారు
- చక్రం తిప్పాడు
- చచ్చి చెడి వచ్చాడు
- చచ్చి సున్నం అయ్యాడు
- చాప కింద నీరు లాగ
- చావు కబురు చల్లగా చెప్పాడు
- చావో రేవో తేల్చు కోవాలి
- చిక్కు ముళ్లు వేశాడు
- చిలక పలుకులు చిటికెలో వస్తా
- చిదంబర రహస్యం:
- చిలకా గోరింకల్ల వున్నారు:
- చిలక్కి చెప్పినట్టు చెప్పాను:
- చదరంగం ఆట అయిపోయిన తరువాత రాజుని, బంటునీ ఒకే పెట్టెలో పడేస్తారు. [బుడతనపల్లి రాజేరు సామెత]