సామెతలు
అం అః
క్ష

"న" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి


  • నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట
  • నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిది
  • నడిచే కాలు, వాగే నోరు ఊరకుండవు!
  • నలుగురితో నారాయణా
  • నల్లటి కుక్కకు నాలుగు చెవులు
  • నల్ల బ్రాహ్మణుణ్ణి ఎర్ర కోవిటిని నమ్మకూడందట
  • నవ్విన నాపచేనే పండుతుంది
  • నాగస్వరానికి లొంగని తాచు
  • నాడా దొరికిందని, గుర్రాన్ని కొన్నట్లు
  • నిండా మునిగిన వానికి చలేంటి
  • నిండు కుండ తొణకదు
  • నిఙ౦ నిప్పులా౦టిది
  • నిజం నిలకడమీద తెలుస్తుంది
  • నిత్య కళ్యాణం, పచ్చ తోరణం
  • నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది
  • నిప్పు ముట్టనిదే చేయి కాలదు
  • నిప్పులేనిదే పొగరాదు
  • నివురు గప్పిన నిప్పులా
  • నీ కాపురం కూల్చకుంటే నే రంకుమొగుణ్ణే కాదన్నాడట
  • నీటిలో రాతలు రాసినట్లు
  • నీ వేలు నా నోట్లో, నా వేలు నీ కంట్లో
  • నీతిలేని పొరుగు నిప్పుతో సమానం
  • నీపప్పూ నా పొట్టూ కలిపి వూదుకు తిందామన్నట్లు
  • నువ్వు దంచు.. నేను భుజాలెగరేస్తాను
  • నూరు చిలుకల ఒకటే ముక్కు
  • నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది
  • నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది
  • నెమలికంటికి నీరు కారితే వేటగాడికి ముద్దా అన్నట్లు
  • నెయ్యిగార పెడతాడంట, పియ్యిగార కొడతాడంట
  • నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు
  • నేతిబీరలో నేతి చందంలా
  • నేల విడిచి సాము చేసినట్లు
  • నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు
  • నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
నందిని పందినిచేయగల వాడు
  
నక్కజిత్తుల వాడు
నక్క తోక వచ్చాడు
నక్కి నక్కి చూస్తున్నాడు
నట్టేట ముంచటం
నడిచే ఎద్దును పొడిచినట్టు
 నడి మంత్రపు సిరి
నడుమొంగనోడు
నల్ల రేగడిలో చల్లినా తెల్ల జొన్నలే పండతాయి
 నలుగురితో నారాయణ
నలుగురు నడిచే దారిలోనె నడవాలి
నలుగురింటే నాలుగు లోకాలిన్నట్టు
 నలుపు నారాయణుడు మెచ్చు ఎరుపు ఎరిముండ మెచ్చు
నల్లేరు మీద నడక
నస పెడుతున్నాడు


నాకు ముగ్గురైతే... నీకు ఆరుగురు కదా అన్నట్టు

"https://te.wikiquote.org/w/index.php?title=సామెతలు_-_న&oldid=11461" నుండి వెలికితీశారు