సామెతలు - క
సామెతలు |
---|
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ ఘ |
చ ఛ జ ఝ |
ట ఠ డ ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
"క" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
- కంగారులో హడావుడి అన్నట్లు
- కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు
- కంచలమా కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని
- కంచానికి ఒక్కడు - మంచానికి ఇద్దరు
- కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
- కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
- కంచే చేను మేస్తే కాపేమి చేయగలడు?
- కంచేచేను మేసినట్లు
- కంటికి ఇంపైతే నోటికీ ఇంపే
- కంటికి రెప్ప కాలికి చెప్పు
- కంటికి రెప్ప దూరమా
- కండలేని వానికే గండం
- కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద
- కందకు లేని దురద కత్తిపీటకెందుకు?
- కందెన వేయని బండికి కావలసినంత సంగీతం
- కంపలో పడ్డ గొడ్డు వలె
- కక్కిన కుక్క వద్దకూ కన్న కుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు
- కక్కుర్తి మొగుడు పెళ్ళాం కడుపు నొప్ప్లి బాధ ఎరుగడు
- కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు
- కట్టని నోరు కట్ట లేని నది ప్రమాద కరము
- కట్టుకున్నదానికి కట్టు బట్టల్లేవు కానీ, ఉంచుకున్నదానికి ఉన్ని బట్టలు కొంటానన్నాడట
- కట్టేవి కాషాయాలు - చేసేవి దొమ్మరి పనులు
- కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువే
- కడుపుతో ఉన్నామె కనక మానుతుందా
- కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా?
- కడుపు చించు కుంటే కాళ్ళ మీద పడుతుంది
- కణత తలగడ కాదు. కల నిజం కాదు
- కనులు మూడు గలవు కాడు త్రినేత్రుండు|కనులు మూడు గలవు కాడు త్రినేత్రుండు పక్షిగాదు చెట్టుపైన నుండు జలము దాల్చి యుండు నీల మేఘుండు గాడు దీని భావమేమి తిరుమలేశ
- కన్ను పోయేంత కాటుక పెట్టదన్నట్లు...
- కన్నెర్రపడ్డా మిన్నెర్రపడ్డా కురవక తప్పదు
- కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం
- కర్రలేని వాడిని గొర్రె కూడా కరుస్తుంది
- కలసి ఉంటే కలదు సుఖం
- కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు
- కల్లు త్రాగిన కోతిలా
- కాకి పిల్ల కాకికి ముద్దు
- కాగల కార్యం గంధర్వులే తీర్చారు
- కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది
- కార్చిచ్చుకు గాడ్పు తోడైనట్లు
- కాలు కాలిన పిల్లిలా
- కాలం కలిసి రాకపోతే కర్రే పామవుతుంది
- కాలం కలిసి వస్తే ఏట్లో వేసినా ఎదురు వస్తుంది
- కాళ్లకు రాచుకుంటే కళ్లకు చలువ
- కాసుకు గతిలేదుకానీ... నూటికి ఫరవాలేదన్నట్లు
- కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు
- 'కురూపీ, కురూపీ ఎందుకు పుట్టేవే?' అంటే 'స్వరూపాలెంచటానికి పుట్టే' అందిట.
- కుంచెడు గింజల కూలికి పోతే.. తూమెడు గింజలు దూడమేసినట్లు
- కుండలో కూడు కుండలోనుండవలె, పిల్లలు చూడ గుండులవలెనుండవలె
- కుక్క కాటుకి చెప్పు దెబ్బ
- కుక్క కి చెప్పు తీపి తెలుసు కానీ ...చెరకు తీపి తెలుస్తుందా
- కుక్క తోక పట్టి గోదారి దాటాలనుకొన్నట్లు
- కుక్కతోక వంకరన్నట్లు...!
- కుప్ప తగులపెట్టి.. పేలాలు ఏరుకుతిన్నట్లు...
- కూటికి లేకున్నా కాటుక మాననట్లు
- కూడూ గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా అన్నాడట
- కూనను పెంచితే గుండై కరవ వచ్చినట్లు
- కూర్చుని తింటే, కొండలైనా తరిగిపోతాయి
- కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
- కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు
- కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు
- కొడితె కొట్టాడులే కానీ కొత్తకోక తెచ్చాడులే అందిట
- కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు
- కొత్త పెళ్ళి కొడుకు పొద్దు ఎరగడు
- కొత్తల్లుడిని మేపినట్లు మేపుతున్నారు
- కొన్నది వంకాయ కొసరింది గుమ్మడి కాయ అన్నట్లు..
- కోటి విద్యలు కూటి కోసమే
- కోడలికి బుధ్ధి చెప్పి అత్త తెడ్డి నాకింది
- కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం
- కోల ఆడితేనే కోతి ఆడుతుందన్నట్లు
- కోస్తే తెగదు కొడితే పగలదు
- క్రింద పడ్డా నాదే పైచేయి అన్నాడంట