సామెతలు
అం అః
క్ష

"త" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి


  • తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట
  • తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట
  • తంతే బూరెల బుట్టలో పడ్డట్టు
  • తనది కాకపోతే కాశీదాకా దేకచ్చు
  • తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా
  • తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే
  • తల లేదు కానీ చేతులున్నాయి... కాళ్లు లేవు కానీ కాయం ఉంది?
  • తల ప్రాణం తోకకి వచ్చినట్లు
  • తలనుంచి పొగలు చిమ్ముచుండు భూతము కాదు, కనులెర్రగనుండు రాకాసి కాదు, పాకిపోవుచుండు పాముకాదు
  • తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది
  • తా వలచినది రంభ, తా మునిగింది గంగ
  • తా(ను) పట్టిన కుందేటికి మూడే కాళ్లు
  • తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడట
  • తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
  • తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది
  • తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు
  • తాడిచెట్టెందుకెక్కావంటే, దూడ గడ్డికోసమన్నాడంట
  • తాడిచెట్టు కింద మజ్జిగ తాగినా కల్లు అంటారు
  • తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు
  • తాతకు దగ్గులు నేర్పినట్టు
  • తాదూర సందు లేదు, మెడకో డోలు
  • తానా అంటే తందానా అన్నట్లు
  • తామరాకు మీద నీటిబొట్టులా
  • తాను దూర సందు లేదు తలకో కిరీటమట
  • తిని కూర్ఛుంటే కొండలైనా కరుగుతాయి
  • తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి
  • తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు
  • తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట
  • తిట్టను పోరా గాడిదా అన్నట్టు
  • తిట్టే నోరు, తిరిగే కాలు , చేసే చెయ్యి ఊరకుండవు
  • తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందట
  • తినగ తినగ వేము తియ్యగనుండు
  • తినబోతూ రుచులు అడిగినట్లు
  • తిన్నింటి వాసాలు లెక్కేయటం
  • తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి?
  • తీగ లాగితే డొంకంతా కదిలినట్లు
  • తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి
  • తూట్లు పూడ్చి... తూములు తెరిచినట్లు...
  • తెలిసే వరకూ బ్రహ్మవిద్య తెలిశాక కూసువిద్య
  • తేలు కుట్టిన దొంగలా
  • తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు
  • తోక తెగిన కోతిలా
  • తోక ముడుచుట
  • తోచీ తోయనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు
"https://te.wikiquote.org/w/index.php?title=సామెతలు_-_త&oldid=6762" నుండి వెలికితీశారు