సామెతలు
అం అః
క్ష

"జ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

  • జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల
  • జన్మకో శివరాత్రి అన్నట్లు
  • జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు
  • జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి
  • జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు
  • జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే
  • జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు
  • జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం
  • జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లు
  • జుట్టు అంటూ ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చు
  • జగడమెట్లొస్తుందిరా జంగమయ్యా అంటే బిచ్చం పెట్ట వే బొచ్చు ముండా అన్నాడట
  • జగడాల మారి
  • జగమెరిగిన సత్యం
  • జగమెండి
  • జగత్ కిలాడీలు
  • జనగణమన పాడేశారు
  • జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది
  • జలగలా పీడిస్తున్నాడు
  • జానెడు ఇంట్లో మూరెడు కర్ర వున్నట్లు
  • జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయా
"https://te.wikiquote.org/w/index.php?title=సామెతలు_-_జ&oldid=11460" నుండి వెలికితీశారు