ఈ రోజు వ్యాఖ్యలు మార్చి 2013
మార్చి 2013 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:
- మార్చి 14, 2013:సూర్యుడు, చంద్రుడు, సత్యం ఈ మూడింటిని దాచలేము.--గౌతమ బుద్ధుడు
- మార్చి 15, 2013:హీనంగా చూడకు దేనీ, కవితామయమోయ్ అన్నీ -- శ్రీశ్రీ
- మార్చి 16, 2013:వ్యాధిని వైద్యుడు తగ్గిస్తాడు, ప్రకృతి మామూలుగానే నయం చేస్తుంది. -- అరిస్టాటిల్
- మార్చి 17, 2013:ఇతరుల సలహాపై ఆధారపడకు, నీ ఆలోచనలను నువ్వు అనుసరించు. -- విలియం షేక్స్పియర్
- మార్చి 18, 2013:పరిస్థితుల దృష్ట్యా నేను తీవ్రవాదిగా నటిస్తున్నా, నిజానికి నేను తీవ్రవాదిని కాను. -- భగత్ సింగ్
- మార్చి 19, 2013:మనిషికి, మనిషికి మధ్య ఉన్న అసమానత్వమే బాధలన్నిటికీ కారణం-- అంబేద్కర్
- మార్చి 20, 2013:నా తెలంగాణ కోటి రతనాల వీణ -- దాశరథి కృష్ణమాచార్య
- మార్చి 21, 2013:తీసుకోవడమే కాదు - ఇవ్వడం కూడా నేర్చుకో -- రామకృష్ణ పరమహంస
- మార్చి 22, 2013:ఎన్నికలలో డబ్బు, మద్యం పంచే వారు ఉగ్రవాదులకన్నా ప్రమాదకరులు. --జయప్రకాష్ నారాయణ (లోక్‌సత్తా)
- మార్చి 23, 2013:కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనే నాకు, సచిన్ టెండుల్కర్‌కు తేడా ఉంది. -- వీరేంద్ర సెహ్వాగ్
- మార్చి 26, 2013:నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు -- ముస్సోలినీ
- మార్చి 27, 2013:నిరంతర అప్రమత్తతే స్వేచ్ఛకు మూలం. -- జాన్ స్టూవర్ట్ మిల్
- మార్చి 28, 2013:నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు. -- అబ్రహం లింకన్
- మార్చి 29, 2013:పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు -- వేమన
- మార్చి 30, 2013:పిల్లి నల్లదా తెల్లదా అనేది కాదు అది ఎలుకను పట్టగలదా లేదా అన్నదే ప్రధానం -- డెంగ్ జియాఓపింగ్
- మార్చి 31, 2013:ప్రజలను ప్రేమించలేనివాడు దేశభక్తుడు కాలేడు -- టంగుటూరి ప్రకాశం