ఈ రోజు వ్యాఖ్యలు సెప్టెంబర్ 2009

సెప్టెంబర్ 2009 మాసములో మొదటి పేజీలో ప్రదర్శించబడిన "ఈ రోజు వ్యాఖ్య"లు".

  • సెప్టెంబర్ 3, 2009: గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్...-- నన్నయ
  • సెప్టెంబర్ 5, 2009: ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. -- మదర్ థెరీసా
  • సెప్టెంబర్ 6, 2009: మహాత్మాగాంధీ లాంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు. -- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
  • సెప్టెంబర్ 7, 2009: సచిన్ టెండుల్కర్ లేని భారత జట్టు అంటే, చప్పుడు లేకుండా ముద్దు పెట్టుకోవడం లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • సెప్టెంబర్ 8, 2009: స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు. -- రూసో
  • సెప్టెంబర్ 9, 2009: భారతీయ రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మరణిస్తున్నాడు. -- ఆర్థర్ లూయీస్
  • సెప్టెంబర్ 10, 2009: కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా -- వేమన
  • సెప్టెంబర్ 12, 2009: పిల్లి నల్లదా తెల్లదా అనేది కాదు అది ఎలుకను పట్టగలదా లేదా అన్నదే ప్రధానం. -- డెంగ్ జియాఓపింగ్
  • సెప్టెంబర్ 14, 2009: ఒక పని చేయకూడదు అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించడమే అనవసరం. -- అనీబీసెంట్
  • సెప్టెంబర్ 16, 2009: చిన్న పిల్లవాడికి నాప్కిన్స్ ఎన్ని సార్లు మార్చాల్సి ఉంటుందో థర్డ్ అంపైర్‌ను కూడా అన్ని సార్లు మార్చాలి. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • సెప్టెంబర్ 18, 2009: పెళ్ళంటే... చేపను పట్టుకోవడం కోసం పాముల పుట్టలో చేయి పెట్టడం లాంటిది. -- లియోనార్డో డావిన్సీ
  • సెప్టెంబర్ 19, 2009: మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు. -- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
  • సెప్టెంబర్ 20, 2009: ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది. -- స్వామీ వివేకానంద
  • సెప్టెంబర్ 21, 2009: కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది. -- మహాత్మా గాంధీ
  • సెప్టెంబర్ 22, 2009: కొంతమంది యువకులు పుట్టుకతో వృధ్ధులు. --శ్రీశ్రీ
  • సెప్టెంబర్ 23, 2009: జీవితంలో భయపడాల్సిందేమీ లేదు, అన్నీ అర్థం చేసుకోవాల్సినవే. -- మేరీ క్యూరీ
  • సెప్టెంబర్ 25, 2009: మానవుడు పుట్టుకతోనే సాంఘిక జంతువు.-- అరిస్టాటిల్
  • సెప్టెంబర్ 26, 2009: వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్‌వేర్ లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • సెప్టెంబర్ 27, 2009: 10మంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను. -- స్వామీ వివేకానంద
  • సెప్టెంబర్ 28, 2009: ఆల్కహాల్ నా నుంచి తీసుకున్నదాని కంటే నేను దాన్నుంచి పొందిందే ఎక్కువ.-- చర్చిల్
  • సెప్టెంబర్ 29, 2009: చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం. -- మార్క్ ట్వెయిన్
  • సెప్టెంబర్ 28, 2009: ఆల్కహాల్ నా నుంచి తీసుకున్నదాని కంటే నేను దాన్నుంచి పొందిందే ఎక్కువ.-- చర్చిల్
  • సెప్టెంబర్ 30, 2009: దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు. -- భగత్ సింగ్


ఇవి కూడా చూడండి

మార్చు