ఈ రోజు వ్యాఖ్యలు ఏప్రిల్ 2012

ఏప్రిల్ 2012 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • ఏప్రిల్ 1, 2012: ---> ఏప్రిల్ ఫూల్స్ డే... మిగిలిన సంవత్సరమంతా మనం ఎలా ప్రవర్తిస్తామో తెలియజేసే రోజు. -- మార్క్ ట్వెయిన్
  • ఏప్రిల్ 3, 2012: ---> పది మంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను -- స్వామీ వివేకానంద
  • ఏప్రిల్ 6, 2012: ---> మానవుడు పుట్టుకతోనే సాంఘిక జంతువు -- అరిస్టాటిల్
  • ఏప్రిల్ 8, 2012: ---> వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్‌వేర్ లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • ఏప్రిల్ 9, 2012: ---> హీనంగా చూడకు దేనీ, కవితామయమోయ్ అన్నీ -- శ్రీశ్రీ
  • ఏప్రిల్ 10, 2012: ---> రాహుల్ ద్రవిడ్ గోడ మాత్రమే కాడు అతను కోట -- షేన్ వార్న్
  • ఏప్రిల్ 12, 2012: ---> రాయిలోనూ, బొమ్మలోనూ భగవంతుడిని చూడు, కాని భగవంతుడిని రాయిలాగా, బొమ్మలాగా చూడకు -- సత్యసాయిబాబా
  • ఏప్రిల్ 13, 2012: ---> బ్రాహ్మణుడు, ముస్లిం ఒకే మట్టితో చేసిన వేర్వేరు పాత్రలు -- కబీరు
  • ఏప్రిల్ 15, 2012: ---> భూమధ్యరేఖకు పైనా, కిందా అభివృద్ధిచెందిన దేశం ఒక్కటీ లేదు. -- గాల్‌బ్రెత్
  • ఏప్రిల్ 16, 2012: ---> ఒపీనియన్స్ అప్పుడప్పుడు ఛేంజ్ చేసుకోకపోతే పొలీటీయన్ కానేరడోయ్--గురజాడ అప్పారావు
  • ఏప్రిల్ 17, 2012: ---> ఆహారంలో క్రమశిక్షణ లేకపోవడమే అనారోగ్యానికి మూలం -- సత్యసాయిబాబా
  • ఏప్రిల్ 18, 2012: ---> అన్నా హజారే గాంధేయవాదే కాని గాంధీ కాదు -- అరుందతీ రాయ్.
  • ఏప్రిల్ 20, 2012: ---> నిజమైన ప్రేమకు అవరోధం లేదు. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది -- మదర్ థెరీసా
  • ఏప్రిల్ 21, 2012: ---> నిర్మాణాత్మక పని లేని సత్యాగ్రహం, క్రియలేని వాక్యం లాంటిది - -రాంమనోహర్ లోహియా
  • ఏప్రిల్ 22, 2012: ---> పరబాషా ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిది. --రవీంద్రనాథ్ ఠాగూర్
  • ఏప్రిల్ 23, 2012: ---> పురుషులందు పుణ్య పురుషులు వేరయ -- వేమన
  • ఏప్రిల్ 24, 2012: ---> అధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవాలంటే అధ్యాత్మిక మార్గంలోనే సాధ్యమౌతుంది -- సత్యసాయిబాబా
  • ఏప్రిల్ 26, 2012: ---> వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు గొడుగు ఇచ్చి వర్షం రాగానే దాన్ని లాక్కునే మనస్తత్వం బ్యాంకరుకుంటుంది. -- క్రౌథర్
  • ఏప్రిల్ 27, 2012: ---> సర్వస్వం రాజ్యం కొరకే, రాజ్యానికి వ్యతిరేకంగా ఏదీ లేదు. --ముస్సోలినీ
  • ఏప్రిల్ 28, 2012: ---> ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలను ఉతికి పారేయడమే ప్రజాస్వామ్యం-- ఆస్కార్ వైల్డ్.
  • ఏప్రిల్ 29, 2012: ---> కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనే నాకు, సచిన్ టెండుల్కర్‌కు తేడా ఉంది. -- వీరేంద్ర సెహ్వాగ్

ఇవి కూడా చూడండి మార్చు