ఈ రోజు వ్యాఖ్యలు జూన్ 2011

జూన్ 2011 మాసములో మొదటి పేజీలో ప్రదర్సించబడిన ఈ రోజు వ్యాఖ్యలు:

  • జూన్ 1, 2011: ---> ధనం వస్తుంది పోతుంది, జ్ఞానం వస్తుంది పెరుగుతుంది -- సత్యసాయిబాబా
  • జూన్ 2, 2011: ---> చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా. -- వేమన
  • జూన్ 4, 2011: ---> దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.--స్వామీ వివేకానంద
  • జూన్ 5, 2011: ---> నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు. -- అబ్రహం లింకన్
  • జూన్ 6, 2011: ---> పదండి ముందుకు, పదండి ముందుకు తోసుకుపోదాం పైపైకి. -- శ్రీశ్రీ
  • జూన్ 7, 2011: ---> ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న -- మదర్ థెరీసా
  • జూన్ 13, 2011: ---> అప్పులేనివాడె యధిక సంపన్నుడు. --వేమన
  • జూన్ 14, 2011: ---> కొంతమంది యువకులు పుట్టుకతో వృధ్ధులు -- శ్రీశ్రీ
  • జూన్ 15, 2011: ---> గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ -- నన్నయ
  • జూన్ 18, 2011: ---> నా కార్యక్రమం పనిచేయుటే కాని మాటలాడుట కాదు -- ముస్సోలినీ
  • జూన్ 19, 2011: ---> పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు -- వేమన
  • జూన్ 21, 2011: ---> భారతీయ రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మరణిస్తున్నాడు. -- ఆర్థర్ లూయీస్
  • జూన్ 22, 2011: ---> మనిషి మంచితనం ఎక్కడ అంతమౌతుందో అక్కడ రాజకీయం మొదలౌతుంది. -- అరిస్టాటిల్
  • జూన్ 23, 2011: ---> మాకులానికి అంతా బావలే. -- కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్ర..
  • జూన్ 25, 2011: ---> వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్‌వేర్ లాంటిది. -- నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • జూన్ 26, 2011: ---> స్త్రీకి మాతృత్వం ఎంత అవసరమో, పురుషుడికి యుద్ధం అంతే అవసరం -- ముస్సోలినీ
  • జూన్ 27, 2011: ---> హీనంగా చూడకు దేనీ, కవితామయమోయ్ అన్నీ -- శ్రీశ్రీ
  • జూన్ 28, 2011: ---> రాహుల్ ద్రవిడ్ గోడ మాత్రమే కాడు అతను కోట -- షేన్ వార్న్
  • జూన్ 29, 2011: ---> బ్రాహ్మణుడు, ముస్లిం ఒకే మట్టితో చేసిన వేర్వేరు పాత్రలు -- కబీరు
  • జూన్ 30, 2011: ---> మంటలచేత మాట్లాడించి, రక్తం చేత రాహాలాపన చేయిస్తాను -- శ్రీశ్రీ


ఇవి కూడా చూడండి మార్చు